బెంగళూరు ముందు భారీ టార్గెట్.. బాదేస్తారా?

ఈడెన్ గార్డెన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా మరోసారి భారీ స్కోర్ చేసింది

By Medi Samrat  Published on  21 April 2024 5:55 PM IST
బెంగళూరు ముందు భారీ టార్గెట్.. బాదేస్తారా?

ఈడెన్ గార్డెన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా మరోసారి భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ( 36 బంతుల్లో 50, 7 ఫోర్లు, ఒక సిక్సర్) , సాల్ట్ (14 బంతుల్లో 48,7 ఫోర్లు, 3 సిక్సులు) రాణించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగుల భారీ స్కోర్ చేసింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కు ఓపెనర్లు సాల్ట్, నరైన్ (10) మరోసారి శుభారంభం ఇచ్చ్చారు. పవర్ ప్లేలో ఏకంగా 75 పరుగులు రాబట్టారు. అయితే స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయిన కేకేఆర్ కాస్త తడబడింది. వెంకటేష్ అయ్యర్ (16) కూడా తక్కువ పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత రింకూ సింగ్ 24 పరుగులు చేసి ఔటైనా.. శ్రేయాస్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రస్సెల్ (20 బంతుల్లో 27), రమన్ దీప్ సింగ్ (9 బంతుల్లో 24) ధాటిగా ఆడడంతో 220 పరుగుల మార్క్ ను కేకేఆర్ దాటింది. ఆర్సీబీ ముందు 223 పరుగుల టార్గెట్ ను ఉంచింది. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాళ్, కామెరూన్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మహమ్మద్ సిరాజ్,లాకీ ఫెర్గుసన్ తలో వికెట్ తీసుకున్నారు.

Next Story