ఎలాగైనా గెలవాలనే కసితో వచ్చాం: శ్రేయస్ అయ్యర్
Kolkata Knight Riders beat Sunrisers Hyderabad by 54 runs.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ప్లే ఆప్స్
By తోట వంశీ కుమార్ Published on 15 May 2022 12:36 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ప్లే ఆప్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో కోల్‌కతా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఆండ్రీ రసెల్ (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ తీవ్రంగా తలబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్‌రమ్ (25 బంతుల్లో 32; 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.
సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన అనంతరం కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో వచ్చామని తెలిపాడు. మా ఆటగాళ్లంతా ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా ఆడారు. ఇక్కడ టాస్ గెలవడం కూడా ముఖ్యం. పుణెలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయం సాధించినట్లు గుర్తించాం. దీంతో ప్రణాళికా బద్దంగా ఆడి విజయం సాధించాం. చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడతామని ఆశిస్తున్నాం. ఈ స్లో వికెట్ పై సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి గొప్పగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో హైదరాబాద్ బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేశామని శ్రేయస్ అన్నాడు.