కోహ్లీ, పుజారా డ‌కౌట్.. క‌ష్టాల్లో భార‌త్

Kohli Pujara fall for ducks India 111/3 at Tea.ముంబై వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త్ టీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2021 2:57 PM IST
కోహ్లీ, పుజారా డ‌కౌట్.. క‌ష్టాల్లో భార‌త్

ముంబై వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త్ టీ విరామానికి మూడు వికెట్ల న‌ష్టానికి 111 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో మ‌యాంక్ అగ‌ర్వాల్‌(52 నాటౌట్‌; 121 బంతుల్లో 6 పోర్లు, 2 సిక్స‌ర్లు)తో పాటు తొలి టెస్టు హీరో శ్రేయాస్ అయ్య‌ర్(7; 21 బంతుల్లో 1 పోర్‌) క్రీజులో ఉన్నాడు.

అంత‌క‌ముందు మైదానంలోని ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా ఉన్న కార‌ణంగా ఆట ఆల‌స్యంగా ప్రారంభం కావ‌డంతో తొలి సెష‌న్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్‌, శుభ్‌మ‌న్ గిల్‌(44; 71 బంతుల్లో 7 పోర్లు, 1 సిక్స్‌) లు తొలి వికెట్‌కు 80 ప‌రుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. ప‌టిష్ట స్థితిలో ఉన్న భార‌త జ‌ట్టును కివీస్ స్పిన్న‌ర్ అజాజ్ ప‌టేల్ గ‌ట్టి దెబ్బ‌కొట్టాడు. భారీ స్కోరుకు బాట‌లు వేస్తున్న ఓపెనింగ్ జంట‌ను విడ‌గొట్టాడు. అజాజ్ ప‌టేల్ బౌలింగ్‌లో గిల్.. రాస్ టేల‌ర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు.

ఆ వెంట‌నే పుజారాను అజాజ్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐదు బంతులు మాత్ర‌మే ఆడిన న‌యావాల్ పుజారా ప‌రుగుల ఖాతాను కూడా తెర‌వ‌కుండానే నిష్ర్క‌మించాడు. మ‌రికాసేప‌టికే భార‌త్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ త‌గిలింది. ఎన్నో అంచ‌నాలతో బ‌రిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ(0) ని కూడా అజాజ్ అదే ఓవ‌ర్‌లో ఆఖ‌రి బంతికి ఔట్ చేశాడు. కివీస్ ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌డంతో అంపైర్ కోహ్లీని ఎల్బీగా ఔట్ ఇచ్చాడు. అయితే.. కోహ్లీ రివ్యూకి వెళ్లాడు. బంతి ప్యాడ్‌కు, బ్యాట్‌కు మ‌ధ్య ఒకేసారి తాకిన‌ట్లు థ‌ర్డ్ అంపైర్ తెలిపాడు. ఈక్ర‌మంలో బంతి వికెట్ల‌ను తాకుతున్న‌ట్లు తేల‌డంతో ఫీల్డ్ అంపైర్ నిర్ణ‌యానికే ఓటు వేశాడు. దీంతో కోహ్లీ అస‌హ‌నంగా మైదానాన్ని వీడాడు. దీంతో భార‌త్ 80 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

ఈ ద‌శ‌లో తొలి టెస్టు హీరో శ్రేయాస్ అయ్య‌ర్ జ‌త‌గా ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను భుజాల‌పై వేసుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌యాంక్ అగ‌ర్వాల్ టెస్టుల్లో ఐదో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. ఇద్ద‌రూ మ‌రో వికెట్ ప‌డ‌కుండా కివీస్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటూ మ‌రో వికెట్ ప‌డ‌కుండా సెష‌న్‌ను ముగించారు.

Next Story