కోచ్ గా ద్రావిడ్.. విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..?
Kohli on Dravid appointment.యూఏఈ వేదికగా నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభకానున్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 17 Oct 2021 2:16 PM ISTయూఏఈ వేదికగా నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నితో టీమ్ఇండియా ప్రధాన కోచ్ గా కొనసాగుతున్న రవిశాస్త్రి పదవికాలం ముగియనుంది. దీంతో తరువాత కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఎంపిక దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. మిస్టర్ డిఫెండబుల్‌కు ఆసక్తి లేకపోయినప్పటికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా ప్రత్యేకంగా ద్రావిడ్‌తో సమావేశమై అతడిని ఒప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ద్రావిడ్ సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కాగా.. ఇదే విషయమై కెప్టెన్ కోహ్లీని విలేకరులు ప్రశ్నించగా.. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను నియమించే విషయంలో ఏమి జరుగుతుందో తనకు సరిగ్గా తెలియదన్నాడు. ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడలేదని జవాబిచ్చాడు. కాగా.. ద్రావిడ్ రాబోయే రెండేళ్ల పాటు జట్టుకు కోచ్‌గా ఉండనున్నాడు. ఈ రెండేళ్లలో భారత జట్టు రెండు ప్రపంచకప్‌లు ఆడనున్న నేపథ్యంలో అతడి కంటే సరైన కోచ్ టీమ్ఇండియాకు దొరకడని అభిమానులు అంటున్నారు. కాగా.. ద్రావిడ్‌కు అండర్-19, ఇండియా-ఏ జట్లకు కోచ్‌గా చేసిన అనుభవంతో పాటు ఎన్‌సీఏ హెడ్‌గా సేవలందించాడు. అతడి శిక్షణలోనే పృథ్వీషా, రిషబ్ పంత్, అవేశ్ ఖాన్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్ లాంటి యువ క్రికెటర్లు మేటి ఆటగాళ్లుగా తయారయ్యారు.