చిరంజీవి పాటలకు కోహ్లీ డ్యాన్స్ చేసేవాడట..!

Kohli frequently danced to Telugu star Chiranjeevi’s songs. భారత మాజీ U-19 క్రికెటర్ ద్వారకా రవితేజ ఇటీవల విరాట్ కోహ్లీని కలిసిన

By Medi Samrat  Published on  13 July 2022 3:45 PM GMT
చిరంజీవి పాటలకు కోహ్లీ డ్యాన్స్ చేసేవాడట..!

భారత మాజీ U-19 క్రికెటర్ ద్వారకా రవితేజ ఇటీవల విరాట్ కోహ్లీని కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఆరేళ్ల విరామం తర్వాత ఇద్దరూ కలిశారు. ఈ ఇద్దరూ ఒకరినొకరు 'చిరు' అని పిలుచుకున్నారు. చిరు అంటే తెలుగు ప్రజలకు మెగా స్టార్ చిరంజీవి అనే విషయం తెలిసిందే..! వీరిద్దరికి చిరంజీవితో ఉన్న అనుబంధం ఏమిటో తెలుగు క్రికెటర్ ద్వారకా రవితేజ షేర్ చేసుకున్నాడు.

ద్వారకా రవితేజ తన U-15 క్రికెట్ రోజులలో విరాట్ కోహ్లీ తన రూమ్‌మేట్ అని, ఇద్దరు కలిసి చిరంజీవి పాటలకు తరచుగా డ్యాన్స్ చేసేవారని పేర్కొన్నారు. ఒకరినొకరు చిరు అని పిలుచుకోవడం మొదలుపెట్టామని రవితేజ పేర్కొన్నారు. ద్వారకా రవితేజ "యూకేలో ఐపీఎల్ తర్వాత.. ఆరు సంవత్సరాల తర్వాత అతనిని కలిశాను. నన్ను చూడగానే చిరు కైసా హై తూ?" అని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. మేము రూమ్‌మేట్స్‌గా ఉన్నప్పుడు U-15 రోజులలో నేను టీవీలో చిరంజీవి పాటలు చూసేవాడినని.. వాటికి డ్యాన్స్ చేసేవాడిని.. అది చూసి కోహ్లీ కూడా చిరంజీవి సినిమా పాటలకు డ్యాన్స్ చేసేవాడు. "అప్పటి నుండి మేము ఒకరినొకరు మా పేర్లతో పిలవలేదు. చిరు అనేది మేము ఒకరికొకరు పెట్టుకున్న ముద్దుపేరు. మేము కలిసినప్పుడల్లా ఒకరినొకరు చిరు అని పిలుచుకుంటాం" అని చెప్పుకొచ్చారు.

"ఇటువంటి మధురమైన జ్ఞాపకాలు. చాలా సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా అనిపించింది. ఏమీ మారలేదు. చిరు(విరాట్ కోహ్లీని) మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. త్వరలో మిమ్మల్ని మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశాడు ద్వారకా రవితేజ.

Next Story
Share it