దక్షిణాఫ్రికా క్రికెట్‌కు భారీ ఎదురుదెబ్బ.. క్లాసెన్ గుడ్ బై

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

By Medi Samrat
Published on : 2 Jun 2025 5:33 PM IST

దక్షిణాఫ్రికా క్రికెట్‌కు భారీ ఎదురుదెబ్బ.. క్లాసెన్ గుడ్ బై

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 33 ఏళ్ల క్లాసెన్ జూన్ 2న సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన చేశాడు. తన దేశానికి అత్యుత్తమ వైట్-బాల్ బ్యాటర్లలో ఒకరిగా నిలిచిన క్లాసెన్.. తన కుటుంబంతో సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపాడు.

2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన కొన్ని నెలల తర్వాత క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రోటీస్ న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్లో ఓడిపోయింది. క్లాసెన్, వన్డేల్లో 2,141 పరుగులు, T20Iలలో 1,000 పరుగులు చేశాడు. క్లాసేన్ కేవలం 4 టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అందులో ఒక సెంచరీ ఉంది. క్లాసెన్ ఇప్పటికే 2024లోనే టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. కానీ వన్డే, టీ20ఐ సర్క్యూట్‌ల నుండి అతను అకస్మాత్తుగా నిష్క్రమించడం దక్షిణాఫ్రికా క్రికెట్ కు పెద్ద ఎదురుదెబ్బ.

Next Story