కేఎల్ రాహుల్ కు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి

KL Rahul undergoes successful surgery in Germany.టీమ్ఇండియా క్రికెటర్, లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు జర్మనీలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2022 4:02 PM IST
కేఎల్ రాహుల్ కు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి

టీమ్ఇండియా క్రికెటర్, లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు జర్మనీలో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ విష‌యాన్ని రాహుల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. అతడికి గజ్జ భాగంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. 'అందరికీ హెలో.. కొన్ని వారాల నుంచి కష్టంగా ఉంది. కానీ సర్జరీ విజయవంతమైంది. నా గాయం మానుతోంది. చక్కగా కోలుకుంటున్నాను. కోలుకునే క్రమం మొదలైంది. మీ సందేశాలకు, ప్రార్థనలకు ధన్యుడను. త్వరలోనే మీ అందరినీ చూస్తాన' అంటూ ట్విట్టర్ లో రాహుల్ పోస్ట్ పెడుతూ, తాను ఆసుపత్రి బెడ్ పై నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాల్సిన రాహుల్ ఉన్నట్టుండి గాయంతో తప్పుకున్నాడు. దీంతో రిష‌బ్ పంత్ ఆ సిరీస్‌కు సార‌థిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాడు. శ్ర‌స్త‌చికిత్స కార‌ణంగా మ‌రో రెండు నెల‌ల పాటు రాహుల్ పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండ‌నున్నాడు. జులై 1 నుంచి ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు మ్యాచ్ నుంచి కూడా రాహుల్ ఇప్ప‌టికే త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

స‌ర్జరీ విజ‌య‌వంతం కావ‌డంతో అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. తొంద‌ర‌గా కోలుకుని క్రికెట్ ఆడాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

Next Story