కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త జెర్సీని చూశారా..?

KKR unveil official jersey 'Uniform of the Knights' ahead of new season.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 15వ సీజ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 2:06 PM IST
కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త జెర్సీని చూశారా..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 15వ సీజ‌న్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అన్ని ఫ్రాంచైజీలు ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలంలో త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల‌ను ద‌క్కించుకున్నాయి. టోర్నీలో విజేత‌గా నిలిచేందుకు అన్ని జ‌ట్ల‌కు సంబంధించిన ఆట‌గాళ్లు, కోచ్ లు వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇక ఈ సారి లీగ్‌లో కొన్ని జ‌ట్లు కొత్త జెర్సీల‌తో బ‌రిలోకి దిగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఢిల్లీ క్యాపిటల్స్, ల‌క్నో వంటి జ‌ట్లు త‌మ కొత్త జెర్సీని చూపించ‌గా.. శుక్ర‌వారం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌మ కొత్త జెర్సీని ఆవిష్క‌రించింది.

జట్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకీ మైసూర్‌, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ త‌మ కొత్త జెర్సీ గురించి అధికారికంగా ప్ర‌క‌టించింది. కేకేఆర్‌ కొత్త జెర్సీ గోల్డ్‌, పర్పుల్‌ కలర్ల మేళవింపుతో రూపుదిద్దుకుంది. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకీ మైసూర్‌ మాట్లాడుతూ.. శ్రేయస్‌ కెప్టెన్సీపై నమ్మకం ఉందన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని, తమ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతీ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

ఇక కేకేఆర్ కొత్త జెర్సీపై నెటీజ‌న్లు నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. కొంద‌రు కొత్త జెర్సీ బాగుంద‌ని చెబుతుండ‌గా.. మ‌రికొంద‌రు పాత జెర్సీనే బాగుంద‌ని అంటున్నారు. రెండు సార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన కోల్‌క‌తా గ‌త సీజ‌న్‌(ఐపీఎల్ 2021) సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. మ‌రీ శ్రేయస్ అయ్యర్ సార‌ధ్యంలో కేకేఆర్ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందో చూడాలి.

Next Story