పెళ్లిచేసుకున్న మిస్ట‌రీ స్పిన్న‌ర్‌.. చిత‌క్కొట్టిన భార్య‌.. వీడియో వైర‌ల్‌ ‌

KKR Spinner Varun Chakravarthy Marries Girlfriend Neha Khedekar. కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి

By Medi Samrat  Published on  13 Dec 2020 6:49 AM GMT
పెళ్లిచేసుకున్న మిస్ట‌రీ స్పిన్న‌ర్‌.. చిత‌క్కొట్టిన భార్య‌.. వీడియో వైర‌ల్‌ ‌

కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. అతి కొద్ది మంది అతిథుల స‌మ‌క్షంలో త‌న ప్రేయ‌సిని వివాహాం చేసుకున్నాడు. సుదీర్ఘకాలంగా నేహా ఖడేఖర్‌తో ప్రేమాయణం నడుపుతున్న వరుణ్.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు వరుణ్‌ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజ‌న్‌లో కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ త‌రుపున ప్రాతినిథ్యం వ‌హించాడు వ‌రుణ్‌. డిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రి దృష్టి త‌న‌వైపుకు తిప్పుకున్నాడు. ఐపీఎల్ 2020 సీజ‌న్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 6.84 ఎకాన‌మీతో 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్‌లో అద‌ర‌గొట్ట‌డంతో.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు అత‌న్ని ఎంపిక చేశారు సెల‌క్ట‌ర్లు. అయితే.. గాయం కార‌ణంగా అత‌డు ఈ ప‌ర్య‌ట‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్థానంలో న‌ట‌రాజ‌న్‌ను ఎంపిక చేయ‌గా.. అత‌డు స‌త్తాచాటిన విష‌యం తెలిసిందే. ఇక వ‌చ్చే ఏడాది భార‌త్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుండ‌డంతో.. వ‌రుణ్ కీల‌కం అవుతాడ‌ని ప‌లువురు మాజీలు విశ్లేషిస్తున్నారు.

శ‌నివారం పెళ్లిచేసుకున్న వ‌రుణ్‌కు కోల్‌క‌త్తా నైట్‌రైడ‌ర్స్‌ ఫ్రాంచైజీ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కేకేఆర్‌ ఒక వీడియోను విడుదల చేసింది. రిసెప్షన్‌ సందర్భంగా దంపతులిద్దరితో క్రికెట్‌ ఆడిపించారు. వరుణ్ బంతి విసరగా... అతని భార్య నేహా బ్యాటింగ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
Next Story