ఆస్ప‌త్రి బెడ్‌పై టీమ్ఇండియా క్రికెటర్‌

Khaleel Ahmed to miss majority of Ranji Trophy season.ఖ‌లీల్ అహ్మ‌ద్ గాయం కార‌ణంగా రంజీట్రోఫీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2022 8:00 AM GMT
ఆస్ప‌త్రి బెడ్‌పై టీమ్ఇండియా క్రికెటర్‌

క్రికెట‌ర్ల‌ జీవితాల్లో గాయాలు ఒక భాగం. కొన్నిసార్లు గాయాల కార‌ణంగా కెరీర్‌ను అర్థాంత‌రంగా ముగించాల్సి వ‌స్తుంది. భారత క్రికెట‌ర్ ఖ‌లీల్ అహ్మ‌ద్ గాయం కార‌ణంగా రంజీట్రోఫీ 2022-23 సీజ‌న్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇది అత‌డి కెరీర్‌కు ఒక ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

ఖ‌లీల్ అహ్మ‌ద్ ఆస్ప‌త్రి బెడ్‌పై ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న ప‌రిస్థితిని వివ‌రించాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధిస్తే తిరిగి మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌స్తాన‌ని అన్నాడు.

'ఇది దురదృష్టకరం. క్రికెట్‌కి దూరంగా ఉండడం చాలా కష్టమైన విషయం. అయినా తప్పడం లేదు. నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, అందుక‌నే రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల‌కు దూరంగా ఉంటున్నా. ప్ర‌స్తుతం కోలుకుంటున్నాను. త్వ‌ర‌లోనే పూర్తి పిట్‌నెస్ సాధించి తిరిగి జ‌ట్టులోకి వ‌స్తాను. నేను కోలుకోవాల‌ని ప్రార్థించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు' అని ఖ‌లీల్ అహ్మ‌ద్ రాసుకొచ్చాడు.

అయితే అత‌డు ఏ స‌మ‌స్య‌తో ఆస్ప‌త్రిలో చేరాడు అన్న సంగ‌తి మాత్రం చెప్ప‌లేదు. కాగా.. గ‌త కొంత కాలంగా ఖ‌లీల్ అహ్మ‌ద్ మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత అతడి ప్లేస్‌ను ఖ‌లీల్ భ‌ర్తీ చేస్తాడ‌ని బావించ‌గా అంత‌గా రాణించ‌లేక‌పోయాడు. 2018లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన ఖలీల్ అహ్మద్.. టీమిండియా తరుపున 11 వన్డేలు, 14 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 15, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. వికెట్లు తీస్తున్న‌ప్ప‌టికీ ధారాళంగా ప‌రుగులు ఇస్తుండ‌డంతో త‌క్కువ స‌మ‌యంలోనే జ‌ట్టులో చోటు కోల్పోయాడు. చివ‌రి సారిగా అత‌డు 2019లో బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్‌లో ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.

Next Story