వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తే.. టి20ల నుంచి నిషేదించారు

Kevin Pietersen Takes Dig At ECB After Ben Stokes' ODI Retirement.వ‌న్డేల‌కు వీడ్కోలు ప‌లికి క్రికెట్ ప్ర‌పంచంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2022 9:10 AM GMT
వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తే.. టి20ల నుంచి నిషేదించారు

వ‌న్డేల‌కు వీడ్కోలు ప‌లికి క్రికెట్ ప్ర‌పంచంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్, టెస్ట్ సార‌థి బెన్ స్టోక్స్ హాట్ టాఫిక్‌గా మారాడు. డ‌ర్హ‌మ్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో చివ‌రి వ‌న్డేను ఆడేశాడు. తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా.. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమవుతోందన్న కారణంగానే తాను వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లు బెన్‌స్టోక్స్ స్పష్టం చేశాడు. తాము కూడా మనుషులమేమని, పెట్రోల్‌ పోస్తే పరిగెత్తే కార్లు కాద‌న్నాడు. విశ్రాంతి లేకుండా ఆడటం ఎవరితరం కాదని ఇంగ్లాండ్‌ బోర్డుకు చురకలంటించాడు.

బెన్‌స్టోక్స్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో అంత‌ర్జాతీయ క్రికెట్ కౌనిల్స్‌(ఐసీసీ), ఆయా దేశాల బోర్డుల‌పై ప‌లువురు మాజీ ఆట‌గాళ్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. విశ్రాంతి లేకుండా ఆడిస్తే ఆటగాళ్లకు పిచ్చెక్కిపోయి ఇలాగే రిటైర్మెంట్‌ ప్రకటిస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్ ఆసక్తిక‌ర ట్వీట్ చేశాడు.' అప్ప‌ట్లో ఒక‌సారి షెడ్యూల్ భ‌యంక‌రంగా ఉంది. నేను ఆడ‌లేన‌ని చెప్పా. అందుక‌నే వ‌న్డే క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నా. అయితే.. ఈసీబీ న‌న్ను టీ20ల నుంచి కూడా నిషేదించింది 'అని పీట‌ర్స‌న్ ట్వీట్ చేశాడు.

ఇంగ్లాండ్ త‌రుపున పీట‌ర్స్‌న్ 104 టెస్టుల్లో 8,181, 136 వన్డేల్లో 4,440, 37 టీ20ల్లో 1,176 ప‌రుగులు చేశాడు. 2004లో అంత‌ర్జాతీయ అర‌గ్రేటం చేసిన పీట‌ర్స‌న్ 2014లో క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.

Next Story