భార‌త్‌తో టీ20 సిరీస్‌కు కేన్ మామ దూరం.. కొత్త కెప్టెన్ ఎవ‌రంటే..?

Kane Williamson Will Miss 3 Match T20I Series Against India.భార‌త్‌లో జ‌రిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2021 11:14 AM GMT
భార‌త్‌తో టీ20 సిరీస్‌కు కేన్ మామ దూరం.. కొత్త కెప్టెన్ ఎవ‌రంటే..?

భార‌త్‌లో జ‌రిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్ దూరం అయ్యాడు. రేప‌టి నుంచి జైపూర్ వేదిక‌గా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. విలియ‌మ్ స‌న్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా టిమ్ సౌథికి సారధ్య బాధ్య‌త‌లు అప్ప‌గించారు. భార‌త ప‌ర్య‌ట‌న‌లో కివీస్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడ‌నుంది. టెస్టు సిరీస్ కోసం విలియ‌మ్ స‌న్ కు విశ్రాంతి నిచ్చిన‌ట్లు కివీస్ బోర్డు వెల్ల‌డించింది.

న‌వంబ‌ర్ 25 నుంచి కాన్పూర్ వేదిక‌గా ప్రారంభం కానున్న రెండు టెస్టుల కోసం విలియ‌న్ స‌న్ స‌న్న‌ద్దం అవుతున్నాడ‌ని అందుకోస‌మే టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడ‌ని కివీస్ బోర్డు తెలిపింది. కైల్ జేమిస‌న్‌, డారెల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్‌, మిచెల్ సాంట్న‌ర్‌లు టీ20, టెస్టు సిరీస్‌ల‌కు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు చెప్పింది. ఇక సౌథి సార‌ధ్యంలో పాల్గొనే టీ20 జ‌ట్ట‌ను ప్ర‌క‌టించింది. భార‌త్-కివీస్ మ‌ధ్య జైపూర్ వేదిక‌గా న‌వంబ‌రు 17న తొలి టీ20, రాంచీ వేదిక‌గా న‌వంబ‌ర్ 19 రెండో టీ20, కోల్‌క‌తా ఈడెన్ గార్డెన్ వేదిక‌గా న‌వంబ‌ర్ 21 మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

కివీస్ టీ20 టీమ్ : టిమ్ సౌథి(కెప్టెన్‌), టాడ్ ఆస్ట‌ల్‌, ట్రెంట్ బౌల్డ్‌, మార్క్ చాంప‌న్‌, లాకీ ఫెర్గూస‌న్‌, మార్గిన్ గుప్తిల్‌, కేల్ జేమీస‌న్‌, ఆడ‌ల్ మిల్నే, డారిల్ మిచెల్‌, జిమ్మి నీష‌మ్‌, గ్లెన్ ఫిలిప్స్‌, మిచెల్ సాట్న‌ర్‌, టీమ్ సీఫ‌ర్ట్‌, ఐష్ సోధి


Next Story
Share it