కేన్ విలియమ్సన్ ని అలా చూసి ఫీల్ అవుతున్న అభిమానులు

Kane Williamson Walks On Crutches At Auckland Airport After IPL 2023 Injury. న్యూజిలాండ్ క్రికెట్ లెజెండ్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో

By Medi Samrat  Published on  4 April 2023 9:45 PM IST
కేన్ విలియమ్సన్ ని అలా చూసి ఫీల్ అవుతున్న అభిమానులు

న్యూజిలాండ్ క్రికెట్ లెజెండ్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో గాయపడ్డంతో టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన భారీ షాట్ ను ఆపేందుకు విలియమ్సన్ గాల్లోకి డైవ్ చేశాడు. అయితే ల్యాండ్ అయ్యే క్రమంలో కుడి మోకాలికి తీవ్ర గాయమైంది.

విలియమ్సన్ న్యూజిలాండ్ చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో, చంకల్లో ఊతకర్రలతో, కాలుకు బ్యాండేజిలతో కనిపించాడు. ఊతకర్రలతో నడస్తూనే మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ పోర్టు వెలుపలికి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. విలియమ్సన్ పరిస్థితి చూసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మంగళవారం ఆక్లాండ్‌లో ల్యాండ్ అయ్యాడు. విమానాశ్రయం నుండి బయటకు వస్తూ "ఇదేమీ బాధాకరమైనది కాదు" అని చెప్పాడు. విలియమ్సన్ గాయం ఏ స్థాయిలో ఉందో ఇంకా తెలియలేదు. ఇక మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. విలియమ్సన్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌ని ప్లేయింగ్ XIలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.


Next Story