చెన్నై మీద గెలిచారు.. కానీ ఊహించని షాక్
Kane Williamson ruled out of IPL 2023. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 16వ సీజన్ అట్టహాసంగా మొదలైంది.
By Medi Samrat
Kane Williamson ruled out of IPL 2023
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 16వ సీజన్ అట్టహాసంగా మొదలైంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ ఓడించింది. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలో ఛేదించింది.
అయితే గుజరాత్ టైటాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. కేన్ విలియమ్సన్ ఈ సీజన్ లో ఇక ఆడడం కష్టమేనని అంటున్నారు. మొదటి మ్యాచ్ లో చెన్నై ఇన్నింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్సర్ ను ఆపే ప్రయత్నంలో బౌండ్రీ లైన్ వద్ద డైవ్ చేసిన కేన్ కుడి మోకాలికి గాయం అయింది. నొప్పితో విలవిల్లాడిన కేన్ ను సహాయ సిబ్బంది తమ భుజాలపై మోసుకుంటూ బయటికి తీసుకెళ్లారు. అతను తిరిగి గ్రౌండ్ లోకి రాలేదు. కేన్ స్థానంలో టైటాన్స్ సాయి సుదర్శన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపింది. వైద్య పరీక్షల తర్వాత కేన్ విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయం అయింది. మోకాలికి ఎయిర్ ఫ్రాక్చర్ అయిందని.. దీనికి కనీసం 45 రోజుల నుంచి 60 రోజుల వరకు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. కేన్ మోకాలికి అయిన గాయం చాలా తీవ్రమైందని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ గ్యారీ కిర్ స్టన్ చెప్పారు. తర్వాతి మ్యాచుల్లో ఆడే పరిస్థితి కష్టమమేనన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మొత్తానికే కేన్ విలియమ్సన్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.