ఆస్ట్రేలియా జట్టులో విబేధాలు..!

Justin Langer's Coaching Style Not Liked By Australian Players. ఆసీస్ లో కోచ్ కు ఆటగాళ్లకు మధ్య విబేధాలు మొదలయ్యాయని మీడియా సంస్థలు చెబుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  31 Jan 2021 9:07 AM GMT
Justin Langers Coaching Style Not Liked By Australian Players.

ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ల జేబుల్లో ఏమి ఉంటాయో అని ఎన్నో అనుమానాలు చాలా రోజులుగా భారీగా చర్చ జరుగుతూ ఉంది. అందుకే వారి జేబుల్లో ఏమి ఉంటాయా అని కెమెరా కన్నులు వెంటాడుతూ ఉంటాయి.. అలాగే అభిమానులు కూడా గమనిస్తూ ఉంటారు. ఇటీవల భారత్ తో మ్యాచ్ సమయంలో ఓ ఆసీస్ ఆటగాడు శాండ్ విచ్ జేబులో పెట్టుకుని వెళ్లడంపై ఆసీస్ కోచ్ లాంగర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆసీస్ లో కోచ్ కు ఆటగాళ్లకు మధ్య విబేధాలు మొదలయ్యాయని మీడియా సంస్థలు చెబుతూ ఉన్నాయి. గబ్బా టెస్టులో తమ ఆటగాడు ఒకరు మైదానంలో తినేందుకు జేబులో సాండ్‌విచ్‌ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని, దాంతో అతడిని అలా చేయొద్దని చెప్పినట్లు జస్టిన్ లాంగర్‌ తెలిపాడు. గత అనుభవాల దృష్ట్యా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై నిరంతరం కెమెరాల నిఘా ఉంటుందని, జేబులో ఏదైనా ఉంటే అది ప్రజల్లోకి వేరే విధంగా వెళ్లే ప్రమాదం ఉన్నట్లు అతడికి చెప్పాడట లాంగర్‌.

భారత్ తో టెస్ట్ సిరీస్ పరాజయం కారణంగా కూడా హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌తో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు విభేదాలు ఏర్పడినట్లు ఆసీస్ కు చెందిన ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. కోచ్‌ వ్యవహారశైలితో ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, జట్టుతో లాంగర్‌ సరిగా వ్యవహరించడం లేదని ఆరోపించినట్లుగా కథనాలు వచ్చాయి. కొందరు సీనియర్‌ ఆటగాళ్లు కూడా లాంగర్‌ తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారని ఆ వార్త సంస్థ ప్రచురించింది.

ఎప్పుడూ ఆటగాళ్లు తమ తిండి విషయాలను గమనించడానికి ఒకరు కావాలనుకుంటే.. అప్పుడు తన పని తాను చేసినట్లు కాదని.. లాంగర్ చెప్పాడట. నేనెప్పుడూ బౌలర్ల గణంకాల గురించి మాట్లాడను. ఎప్పుడూ బౌలర్ల సమావేశానికి హాజరుకాను. బౌలింగ్‌ కోచ్‌ ఉండేదే అందుకు. అయితే కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. ఆ విషయాలపైనా చూడాలని ఆసీస్‌ కోచ్‌ లాంగర్ అన్నారని ఆసీస్ మీడియా చెబుతోంది.


Next Story