ఒక రోజు ముందుగానే ప్లేయింగ్-11ని ప్రకటించిన ఆస్ట్రేలియా.. జట్టులోకి తిరిగొచ్చిన ప్రమాదకర ఆటగాడు
బ్రిస్బేన్‌లో భారత్‌తో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ఒకరోజు ముందుగానే తన ప్లేయింగ్-11ని ప్రకటించింది.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 12:15 PM ISTబ్రిస్బేన్‌లో భారత్‌తో జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ఒకరోజు ముందుగానే తన ప్లేయింగ్-11ని ప్రకటించింది. జోస్ హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి రావడంతో స్కాట్ బోలాండ్ జట్టును వీడాల్సి వచ్చింది. గాయం కారణంగా హేజిల్‌వుడ్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడలేదు. తను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని.. గబ్బాలో టీమిండియాతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని పాట్ కమిన్స్ చెప్పాడు. ఇది కాకుండా జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. చాలా కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న స్టీవ్ స్మిత్‌ను జట్టులో ఉంచారు. నాథన్ మాక్స్‌వానీ కూడా జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
హాజిల్‌వుడ్‌కు సైడ్ స్ట్రెయిన్ సమస్య ఉంది. అతనికి చాలాసార్లు ఈ సమస్య వచ్చింది. అయితే హేజిల్‌వుడ్ పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని.. మూడో మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తాడని కమిన్స్ విశ్వాసం వ్యక్తం చేశాడు. "అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. నిన్న బాగా బౌలింగ్ చేశాడు. కొన్ని రోజుల క్రితం అడిలైడ్ ఓవల్‌లో కూడా అతను బాగా బౌలింగ్ చేసాడు. అతడు, వైద్య బృందం అతనిపై చాలా నమ్మకంగా ఉంది" అని చెప్పాడు.
పెర్త్‌లో హేజిల్‌వుడ్‌ను బౌలింగ్ చేయకుండా ఆపినట్లు కమ్మిన్స్ చెప్పాడు.. ఎందుకంటే అతని గాయం మరింత తీవ్రంగా మారకూడదని తాము కోరుకున్నామన్నాడు. కమిన్స్ మాట్లాడుతూ.. ఇది రెండవ ఇన్నింగ్స్ సమయంలో జరిగింది. హేజిల్‌వుడ్ అటువంటి గాయాన్ని దాటవేసి బౌలింగ్ చేయడం.. మనం గతంలో కొన్ని సార్లు చూశాము.. ఆపై అతను ఒక నెల లేదా రెండు నెలల పాటు ఆటకు దూరం అయ్యాడని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం చెలాయించే మైదానం గబ్బా. ఈ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులభం కాదు. అయితే గత టూర్‌లో టీమిండియా ఈ గడ్డపై విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీని తర్వాత వెస్టిండీస్ కూడా ఈ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించింది. 2021 నుండి ఆస్ట్రేలియా ఈ మైదానంలో నాలుగు మ్యాచ్‌లు ఆడింది.. అందులో రెండు ఓడిపోయింది.
ఆస్ట్రేలియా ప్లేయింగ్-11:
పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వానీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.