IPL 2023 ప్రారంభం కావడానికి ఇంకా వారం మాత్రమే ఉంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ కు చెందిన బెయిర్‌స్టో ఎడమ కాలికి గాయమై ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బెయిర్‌స్టో స్థానంలో అన్‌క్యాప్డ్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మాథ్యూ షార్ట్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ESPN క్రిక్ సమాచారం ప్రకారం.. జానీ బెయిర్‌స్టో గత ఆగస్టులో తగిలిన గాయం నుండి కోలుకుంటున్నాడు.
ఈ విషయం పంజాబ్ కింగ్స్ ట్వీట్ ద్వారా ధృవీకరించబడింది. పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేస్తూ.. "జానీ బెయిర్‌స్టో గాయం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్‌లో భాగం కాలేడని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాము. మేము అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తదుపరి సీజన్‌లో అతనిని చూడటానికి ఎదురుచూస్తున్నాము." మాథ్యూ షార్ట్ అతనిలో చేర్చబడ్డాడు అని పేర్కొంది. బెయిర్‌స్టో గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున 11 ఇన్నింగ్స్‌లలో 23.00 సగటుతో.. 144.57 స్ట్రైక్ రేట్‌తో.. రెండు అర్ధ సెంచరీలతో 253 పరుగులు చేశాడు.