ఝుల‌న్ గోస్వామి బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌

Jhulan Goswami bowls to KL Rahul at the NCA nets.కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండ‌గా ఝుల‌న్ గోస్వామి బౌలింగ్ చేసిందా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2022 8:35 AM GMT
ఝుల‌న్ గోస్వామి బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌

కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండ‌గా ఝుల‌న్ గోస్వామి బౌలింగ్ చేసిందా..? ఇదేమిటి..? ఒకరేమో మ‌హిళా క్రికెట‌ర్‌, మ‌రొక‌రు పురుషుల టీమ్‌కు వైస్ కెప్టెన్. వీరిద్ద‌రు క‌లిసి మ్యాచ్ ఎప్పుడు ఆడారు..? అనేగా మీ డౌట్‌. అక్క‌డికే వ‌స్తున్నాం. కాస్త ఆగండి అస‌లు మ్యాట‌రేంటో చెబుతాం.

వివ‌రాల్లోకి వెళితే.. కేఎల్ రాహుల్ ఇటీవ‌ల జ‌ర్మ‌నీలో స్పోర్ట్స్ హెర్నియా శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రాహుల్ కోలుకున్నాడు. ఫిట్‌నెస్ సాధించేందుకు బెంగ‌ళూరులోని ఎన్‌సీఏ(నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మి)లో శ్ర‌మిస్తున్నాడు. భార‌త మ‌హిళా క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి కూడా ఎన్‌సీఏలో ఉంది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రూ క‌లిసి నెట్ ప్రాక్టీస్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఝుల‌న్ బౌలింగ్ చేయ‌గా కేఎల్ రాహుల్ క‌వ‌ర్‌డ్రైవ్‌, బ్యాక్‌ఫూట్ షాట్ల‌తో అల‌రించాడు.

శ‌స్త్ర చికిత్స కార‌ణంగా కేఎల్ రాహుల్ స్వ‌దేశంలో జ‌రిగిన సౌతాఫ్రికా సిరీస్‌, ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నాడు. జూలై 22 నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ ప‌ర్య‌ట‌కు రాహుల్‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా మూడు వ‌న్డేలు, ఐదు టీ20 లు ఆడ‌నుంది.

Next Story
Share it