బంగ్లాతో రెండో టెస్టు.. టీమ్ఇండియాలో అనూహ్య మార్పు

Jaydev Unadkat makes COMEBACK after 12 years.సిరీస్ విజ‌య‌మే ల‌క్ష్యంగా టీమ్ఇండియా మీర్‌పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2022 5:09 AM GMT
బంగ్లాతో రెండో టెస్టు.. టీమ్ఇండియాలో అనూహ్య మార్పు

సిరీస్ విజ‌య‌మే ల‌క్ష్యంగా టీమ్ఇండియా మీర్‌పూర్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో బ‌రిలోకి దిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. భార‌త జ‌ట్టులో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. తొలి టెస్టులో 8 వికెట్లు తీసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన కుల్దీప్ యాద‌వ్‌ను ఈ మ్యాచ్‌కు త‌ప్పించారు. ఈ చైనామ‌న్ స్పిన్న‌ర్ స్థానంలో జ‌య‌దేవ్ ఉన్నాద్క‌త్‌కు చోటు క‌ల్పించారు.

ముగ్గురు పేస‌ర్ల‌తో భార‌త్ బ‌రిలోకి దిగింది. తొలి టెస్టులో రాణించిన స్పిన్‌ ఆల్‌రౌండ‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను కొన‌సాగించారు. ఇప్ప‌టికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భార‌త్ ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి వ‌న్డే సిరీస్‌కు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని బావిస్తోంది.

అటు బంగ్లాదేశ్‌ జట్టులో రెండు మార్పులు జ‌రిగాయి. బ్యాటర్‌ యాసిల్‌ అలీ స్థానంలో మొమినుల్‌ హక్‌ను, బౌలర్‌ ఇబాదత్‌ హొస్సైన్‌ ప్లేస్‌లో టస్కిన్‌ అహ్మద్‌ను తుది టీమ్‌లోకి తీసుకున్నారు.

భారత జ‌ట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్ జ‌ట్టు : నజ్ముల్ హొస్సేన్ శాంటో, జకీర్ హసన్, మోమినుల్ హక్, లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్‌), నూరుల్ హసన్(వికెట్ కీప‌ర్‌), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, తస్కిన్ అహ్మద్

Next Story
Share it