గెలుపు ఉత్సాహాంలో ఉన్న టీమ్ఇండియాకు షాక్‌..

Jasprit Bumrah to miss fourth test against England.మూడో టెస్టు గెలిచి మంచి ఉత్సాహాంగా ఉన్న టీమ్ఇండియాకు షాక్ త‌గిలింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2021 2:39 PM IST
గెలుపు ఉత్సాహాంలో ఉన్న టీమ్ఇండియాకు షాక్‌..

మూడో టెస్టు గెలిచి మంచి ఉత్సాహాంగా ఉన్న టీమ్ఇండియాకు షాక్ త‌గిలింది. నాలుగో టెస్టుకు స్టార్ పేస‌ర్ బుమ్రా దూరం అయ్యాడు. వ్య‌క్తిగ‌త కార‌ణాల దృష్ట్యా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టు నుంచి త‌ప్పుకున్నాడు. ఈ మేర‌కు బీసీసీఐ( భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. బుమ్రా స్థానంలో మ‌రో ఆట‌గాడిని తీసుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. మార్చి 4న చివరి టెస్ట్ ప్రారంభం అవుతుంది. కాగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా ఇప్పటికే 2-1తో సిరీస్‌లో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.


ఇక ఈ మ్యాచ్ టీమ్ఇండియాకు చాలా కీల‌కం. ఎందుకంటే ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ పాయింట్ల ఫైన‌ల్‌లో చోటు ద‌క్కాలంటే.. ఈ మ్యాచ్ ఫ‌లితంపైనే ఆధార‌ప‌డి ఉంది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచినా.. లేదా డ్రా చేసుకున్నా కూడా ఫైన‌ల్‌లో అడుగుపెట్టేందుకు మార్గం సుగ‌మ‌మం అవుతుంది. ఒక‌వేళ భార‌త్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే మాత్రం.. ఆస్ట్రేలియా ఫైన‌ల్ చేరే అవ‌కాశం ఉంది. అయితే.. ఈ కీల‌క మ్యాచ్‌కు బుమ్రా లేకున్నా పెద్ద‌గా లోటు క‌నిపించ‌ద‌ని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. మూడో టెస్టు మ్యాచ్ జ‌రిగిన మొతెరాలోనే ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. గ‌త మ్యాచ్‌లో స్పిన్న‌ర్ల హ‌వా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి కూడా స్పిన్న‌ర్లే ఆధిప‌త్యం చెలాయించే అవ‌కాశం ఉందని అంటున్నారు.



Next Story