బుమ్రా వచ్చేస్తున్నాడు..!
Jasprit Bumrah Returns From Injury. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో అంతర్జాతీయ క్రికెట్ లో పునరాగమనం చేయనున్నాడు.
By M.S.R
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో అంతర్జాతీయ క్రికెట్ లో పునరాగమనం చేయనున్నాడు. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కోసం బుమ్రాను భారత జట్టు కోసం సెలెక్ట్ చేశారు. బుమ్రా చివరిసారిగా గత ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన T20I లలో భారత జట్టు తరపున ఆడాడు. అతని వెన్నులో సమస్యలు ఉన్న కారణంగా T20 ప్రపంచ కప్ నుండి పక్కనపెట్టారు. బుమ్రా పునరాగమనం భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని బలపరుస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు. భారత దేశంలో 50 ఓవర్ల ప్రపంచ కప్ ఆడనుండగా.. భారత జట్టులో కీలక ఆటగాడు బుమ్రా. అతడి ఫిట్ నెస్ చాలా ముఖ్యం. టీమ్ మేనేజ్‌మెంట్ ఎలా బుమ్రాను వాడుకుంటుందో ఆసక్తికరంగా ఉండనుంది. అంతర్జాతీయ టోర్నమెంట్‌ల ముందు గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవ్వకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త చర్యలను ప్రకటించింది.
శ్రీలంక వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్యా (VC), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.