మెగావేలానికి ముందు రాయ్ విధ్వంసం.. మూడు ఫ్రాంచైజీల కన్ను అతడిపైనే..!
Jason Roy's whirlwind ton helps Gladiators clinch high-scoring game.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మెగా వేలం మరో
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2022 3:06 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మెగా వేలం మరో నాలుగు రోజుల్లో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మెగా వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు పది ప్రాంచైలు పోటీ పడనున్నాయి. రికార్డులతో పని లేకుండా ప్రస్తుతం ఫామ్ ఆధారంగానే ఆటగాళ్లను కొనుగోలు చేయాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు అన్ని అంతర్జాతీయ మ్యాచులతో పాటు వివిధ లీగ్‌ల్లో రాణిస్తున్న ఆటగాళ్లపై ఓ కన్నేసి ఉంచాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్ 2022)లో విధ్వంసం సృష్టించిన ఓ ఇంగ్లాండ్ ఆటగాడిపై ప్రధానంగా మూడు ప్రాంఛైజీలు కన్నేసినట్లు సమాచారం.
పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ క్వెటా గ్లాడియేటర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం లాహోర్ ఖంలాండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయ్ బ్యాట్‌తో భీభత్సం సృష్టించాడు. కేవలం 57 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్( 45 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), హారీ బ్రూక్(17 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వీస్(9 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం క్వెటా గ్లాడియేటర్స్ రాయ్ విధ్వంసంతో 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.
ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనుంది. ఈ మెగా వేలంలో జేసన్ రాయ్ రూ.2కోట్లకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. అతడిని దక్కించుకుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరులు బావిస్తున్నాయి. మరీ ఏ జట్టు రాయ్‌ను తీసుకుంటుందో చూడాలి. ఇక ఐపీఎల్‌లో 2017 నుంచి రాయ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడుతున్నాడు. మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ అతడిని విడిచిపెట్టింది.