రెండో టెస్ట్‌.. టాస్ ఆల‌స్యం.. ర‌హానే, జ‌డేజా, ఇశాంత్ ఔట్‌

Ishant Rahane and Jadeja out with injuries.ముంబైలోని వాంఖడే వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య నేడు(శుక్ర‌వారం)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Dec 2021 11:10 AM IST
రెండో టెస్ట్‌.. టాస్ ఆల‌స్యం.. ర‌హానే, జ‌డేజా, ఇశాంత్ ఔట్‌

ముంబైలోని వాంఖడే వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య నేడు(శుక్ర‌వారం) ప్రారంభం కావాల్సిన రెండో టెస్టు మ్యాచ్ మ‌రికొంత ఆల‌స్యంగా ప్రారంభం కానుంది. గ‌త రెండు రోజులుగా ముంబైలో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా మైదానంలోని ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారింది. దీంతో 9.30 గంట‌ల‌కు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 12 గంట‌ల నుంచి ఆరంభం కానుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు మైదానాన్ని ప‌రిశీలించిన అంపైర్లు ఔట్‌ఫీల్డ్‌పై సంతృప్తి వ్య‌క్తం చేయడంతో 11.30గంట‌ల‌కు టాస్ వేయ‌నున్నారు. అనంత‌రం 12 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి రోజు తొలి సెష‌న్ ఆట పూర్తిగా తుడిపెట్టుకుపోగా.. నేడు మ‌రో రెండు సెష‌న్ల ఆట‌మాత్ర‌మే మిగిలింది.

ర‌హానే, ఇషాంత్‌, జ‌డేజా ఔట్‌..

అంద‌రూ అనుకున్న‌ట్లే ఫామ్‌లేమితో ఇబ్బంది ప‌డుతున్న వైస్ కెప్టెన్ ర‌హానే ను టీమ్‌మేనేజ్‌మెంట్ ప‌క్క‌న పెట్టింది. అలాగే కాన్పూర్ టెస్టులో ఆడిన ఇషాంత్‌, జ‌డేజా కూడా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యారు. వీరిద్ద‌రూ గాయప‌డ‌డంతో ఈ మ్యాచ్‌కు దూరం అయ్యార‌ని బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) తెలిపింది. ఇక ర‌హానే స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడ‌నుండ‌గా.. జ‌డేజా, ఇషాంత్ స్థానాల్లో ఎవ‌రు ఆడ‌నున్నార‌నే విష‌యాన్ని ఇంకా వెల్ల‌డించ‌లేదు. అటు కివీస్ కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్ కూడా గాయం కార‌ణంగా ఈ టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో కివీస్‌కు టామ్ లాథ‌మ్ సార‌ధిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

Next Story