ఐర్లాండ్ బౌల‌ర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్.. వీడియో

Ireland's Joshua Little takes hat-trick.ఐర్లాండ్ లెఫ్టార్మ్ పేసర్ జాషువా లిటిల్ హ్యాట్రిక్‌తో అబ్బుర ప‌రిచాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2022 12:13 PM IST
ఐర్లాండ్ బౌల‌ర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్.. వీడియో

ఇంత‌క‌ముందు ఎన్న‌డూ లేనంతగా హోరాహోరీగా ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 టోర్నీ సాగుతోంది. ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు అవుతున్నాయి. తాజాగా ఐర్లాండ్ లెఫ్టార్మ్ పేసర్ జాషువా లిటిల్ హ్యాట్రిక్‌తో అబ్బుర ప‌రిచాడు. అడిలైడ్‌లో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, జిమ్మీ నీషమ్ మరియు మిచెల్ సాంట్నర్‌లను లిటిల్ వ‌రుస బంతుల్లో ఔట్ చేశాడు. కాగా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఇది రెండో హ్యాట్రిక్. అంతకుముందు శ్రీలంకపై యూఏఈకి చెందిన కార్తీక్ మెయ్యప్పన్ హ్యాట్రిక్ సాధించాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. ఫామ్ అందుకున్న కెప్టెన్ కేన్ విలియ‌న్ స‌న్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. మిగిలిన వారిలో ఓపెన‌ర్ అలెన్ 32, కాన్వే 28, మిచెల్ 31 ప‌రుగులు చేశారు.

ఓ ద‌శ‌లో కివీస్ అల‌వోక‌గా 200 ప‌రుగులు దాటేలా క‌నిపించింది. అయితే.. 19 ఓవ‌ర్‌లో జాషువా లిటిల్ వ‌రుస బంతుల్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్ ల వికెట్లు ప‌డ‌గొట్టి కివీస్ భారీ స్కోర్ సాధించ‌కుండా అడ్డుకున్నాడు. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో లిటిల్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, గారెత్ డెలానీ రెండు, మార్క్ అడైర్ ఓ వికెట్ తీశారు.

Next Story