ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్‌కు అంతా సిద్దమైంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలెట్టాయి. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు తమదైన వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎప్పటిలాగానే ఈ సీజన్‌లో కూడా మెరుపులు మెరిపించేందుకు కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ 13 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు అత్యధికంగా 5 సార్లు కప్పు గెలవగా.. ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్‌కు కప్ తీరని కలగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే.. 2008 నుంచి సీజన్ విజేతలు ఎవరో ఓసారి లుక్కేద్దాం..
2008 నుంచి సీజన్ విజేతలు..
2008 - రాజస్థాన్ రాయల్స్
2009 - డెక్కన్ ఛార్జర్స్
2010 - చెన్నై సూపర్ కింగ్స్
2011 - చెన్నై సూపర్ కింగ్స్
2012 - కోల్‌కత్తా నైట్ రైడర్స్
2013 - ముంబై ఇండియన్స్
2014 - కోల్‌కత్తా నైట్ రైడర్స్
2015 - ముంబై ఇండియన్స్
2016 - సన్ రైజర్స్ హైదరాబాద్
2017 - ముంబై ఇండియన్స్
2018 - చెన్నై సూపర్ కింగ్స్
2019 - ముంబై ఇండియన్స్
2020 - ముంబై ఇండియన్స్