IPL Winners : ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జ‌ట్లు ఇవే

నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజ‌న్ ప్రారంభం కానుంది. 2008 నుంచి 2023 వ‌ర‌కు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జ‌ట్లు ఏవో చూద్దాం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2023 4:25 AM GMT
IPL, IPL winners

ఐపీఎల్ విజేత‌లు ప్ర‌తీకాత్మ‌క చిత్రం


క్రికెట్ అభిమానులంతా ఎంతగానో ఎద‌రుచూస్తున్న స‌మయం వ‌చ్చేసింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్ మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుంది. బౌండ‌రీల వ‌ర్షంలో త‌డిసిముద్ద అయ్యేందుకు అభిమానులు సిద్దం అయ్యారు. మొత్తం 10 జ‌ట్లు టైటిల్ కోసం హోరా హోరీగా పోటీ ప‌డ‌నున్నాయి. టైటిల్ గెల‌వాల‌న్న క‌సి అంద‌రిలో ఉన్నప్ప‌టికీ.. ఆ భాగ్యం ఒక్క‌రినే వ‌రిస్తుంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ ట్రోపీలు గెలుచుకున్న జ‌ట్లు ఏవో ఓ సారి చూద్దాం..

ఏ జ‌ట్టు ఎన్ని సార్లు టైటిట్ అందుకుందంటే..?

ఇప్ప‌టి వ‌ర‌కు 15 సీజ‌న్లు జ‌రుగ‌గా అత్య‌ధికంగా రోహిత్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను అందుకుంది. ఆ త‌రువాత నాలుగు సార్లు ధోని సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు గెలుచుకుంది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ రెండు సార్లు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, డెక్కన్ ఛార్జర్స్, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు ఒక్కొసారి విజేత‌గా నిలిచాయి.

- రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) : 2008

- డెక్కన్ ఛార్జర్స్(Deccan Chargers): 2009

- ముంబై ఇండియన్స్(Mumbai Indians) : 2013, 2015, 2017, 2019, 2020

- చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) : 2010, 2011, 2018, 2021

- కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) : 2012, 2014

- సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) : 2016

- గుజ‌రాత్ టైటాన్(Gujarat Titans) : 2022]

ఇప్ప‌టి వ‌ర‌కు ట్రోఫిని ముద్దాడ‌ని జ‌ట్లు ఇవే..

- ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)

- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)

- పంజాబ్ కింగ్స్(Punjab Kings)

- లక్నో సూపర్ జెయింట్స్( Lucknow Super Giants)

ఈ సారి అయినా కొత్త జ‌ట్టు విజేతగా నిలుస్తుందా..? ఎప్ప‌టిలాగానే వీటికి టైటిల్ అంద‌ని ద్రాక్ష‌గానే మిగ‌ల‌నుందా..? చెన్నై లేదంటే ముంబై జ‌ట్లు త‌మ ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తా..? లేదా..? అన్న‌ది మ‌రికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Next Story