కోల్‌కతాలో అంగరంగ వైభవంగా IPL ప్రారంభోతవ్సం..ఎవరెవరు వస్తున్నారంటే?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం అనేక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరగనుంది.

By Knakam Karthik
Published on : 19 March 2025 5:51 PM IST

Sports News, IPL Opening Ceremony, Bollywood Stars, Shreya Ghoshal, Disha Patani

కోల్‌కతాలో అంగరంగ వైభవంగా IPL ప్రారంభోతవ్సం..ఎవరెవరు వస్తున్నారంటే?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం అనేక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్‌, ఆర్‌సీబీ మ‌ధ్య జ‌రిగే తొలి మ్యాచ్‌కు 18వ సీజ‌న్‌కు తెర‌లేవ‌నుంది. నటి దిశా పటాని మరియు శ్రేయా ఘోషల్ ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఇందుకు సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన అధికారిక ఎక్స్ పేజీలో రాసుకొచ్చింది. "ఐపీఎల్ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు, ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన వేడుక జరగాలి! వేదికను వెలిగించడానికి సంచలనాత్మక దిశా పటానీ కంటే ఎవరు మంచివారు?యొక్క అద్భుతమైన ప్రారంభోత్సవాన్ని మిస్ అవ్వకండి." అంటూ రాసుకొచ్చింది.

అయితే ఈ మెగా ఈవెంట్‌లో బాలీవుడ్ బ‌డా స్టార్లు మెర‌వ‌నున్నార‌ని తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి స‌ల్మాన్ ఖాన్‌, షారుఖ్ ఖాన్‌, సంజ‌య్ ద‌త్‌, విక్కీ కౌశ‌ల్‌, వ‌రుణ్ ధావ‌న్‌, శ్ర‌ద్ధా క‌పూర్ రానున్న‌ట్లు సంబంధిత వ‌ర్గాల స‌మాచారం. కాగా, ఈ నెల 22 నుంచి ప్రారంభ‌మ‌య్యే ఐపీఎల్ 18వ సీజ‌న్ మే 25 వ‌ర‌కు జ‌రుగుతుంది. 65 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జ‌రుగుతాయి. మే 25న జ‌రిగే ఫైన‌ల్‌తో టోర్నీ ముగుస్తుంది.

Next Story