IPL: అలాంటి ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం.. రెగ్యులేషన్స్‌ ఇవే

ఐపీఎల్‌ వేలం కోసం రిజిస్టర్‌ చేసుకుని, సెలెక్ట్‌ అయిన ప్లేయర్లు కచ్చితంగా టోర్నీలో ఆడాలని గవర్నింగ్‌ కౌన్సిల్‌ తెలిపింది.

By అంజి  Published on  29 Sep 2024 2:45 AM GMT
IPL, retention, auction rules, IPL 2025

IPL: అలాంటి ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం.. రెగ్యులేషన్స్‌ ఇవే

ఐపీఎల్‌ వేలం కోసం రిజిస్టర్‌ చేసుకుని, సెలెక్ట్‌ అయిన ప్లేయర్లు కచ్చితంగా టోర్నీలో ఆడాలని గవర్నింగ్‌ కౌన్సిల్‌ తెలిపింది. సీజన్‌ ప్రారంభానికి ముందు అందుబాటులో లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ ఆటగాళ్లపై రెండు సీజన్ల పాటు నిషేధం విధించనున్నట్టు పేర్కొంది. అలాగే ఓవర్సీస్‌ ప్లేయర్లు బిగ్‌ ఆక్షన్‌ కోసం తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాలని, లేదంటే వచ్చే ఏడాదికి వారు అర్హులు కారని తెలిపింది.

ఐపీఎల్‌ - 2025కు సంబంధించి ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్లేయర్‌ రెగ్యులేషన్స్‌ను ప్రకటించింది. ఒక్కో ఫ్రాంఛైజీ ప్రస్తుతం ఉన్న జట్టులో ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్‌ / ఆర్టీఎమ్‌ ఆప్షన్‌ ద్వారా రిటైన్‌ చేసుకోవచ్చని తెలిపింది. వీరిలో MAX ఐదురుగు క్యాప్‌డ్‌ ప్లేయర్లు, MAX ఇద్దరు అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లు ఉండొచ్చని పేర్కొంది. 2025 వేలానికి రూ.120 కోట్లను ఆక్షన్‌ పర్స్‌గా ఖరారు చేసింది. టోటల్‌ శాలరీ క్యాప్‌ రూ.146 కోట్లు అని తెలిపింది.

ఐపీఎల్‌లో ఇంప్టాక్‌ ప్లేయర్‌ రూల్‌ 2027 వరకు కొనసాగుతుందని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. 2027 సీజన్‌ అయ్యాక ఆ తర్వాత కొనసాగించాలా? లేదా? అనేది నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఈ రూల్‌ను తొలిసారి 2023 సీజన్‌లో అమలు చేశారు. దీని ప్రకారం మ్యాచ్‌ మధ్యలో ప్లేయింగ్‌ 11లో ఉన్న ఓ ప్లేయర్‌ను మరో ఆటగాడితో రీప్లేస్‌ చేసి ఆడించవచ్చు.

Next Story