అయ్యో.. ఫైనల్‌లో ఓటమి తర్వాత కావ్య కన్నీళ్లు (వీడియో)
ఆరెంజ్ ఆర్మీ వేలం పాట నుంచి మొదలుకొని మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా తన జట్టుతో వెన్నంటే ఉండే సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్.
By Srikanth Gundamalla Published on 27 May 2024 10:32 AM ISTఅయ్యో.. ఫైనల్‌లో ఓటమి తర్వాత కావ్య కన్నీళ్లు (వీడియో)
దాదాపు రెండు నెలలకు పైగా సాగిన ఐపీఎల్ మెగా టోర్నీ అట్టహాసంగా ముగిసింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు.. అలరించే బ్యాటింగ్.. కొత్త రికార్డులు ఇలా 2024 సీజన్ ఐపీఎల్ కొనసాగింది. అయితే.. ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. హైదరాబాద్పై కోల్‌కతా 8 వికెట్ల తేడాతో నెగ్గి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో అనూహ్య ప్రదర్శనతో ఫైనల్ దాకా వచ్చిన సన్‌రైజర్స్.. చిట్టచివరి మెట్టుపై బోల్తాపడింది. కేవలం 18.3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో ఆరెంజ్ టీమ్ ఫ్యాన్స్ అంతా నిరాశ చెందారు. ఫైనల్‌లో ఘోర ఓటమిని తట్టుకోలేకపోతున్నారు.
ఆరెంజ్ ఆర్మీ వేలం పాట నుంచి మొదలుకొని మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా తన జట్టుతో వెన్నంటే ఉండే సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్. తన టీమ్ గెలిచినప్పుడు ఆమె సంతోషంతో పొంగిపోతారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కావ్య మారన్ ఎంజాయ్ చేస్తూ గంతులేస్తున్న వీడియోలు నెట్టింట చాలా వైరల్ అయ్యాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఘోర ఓటమిని చూడటంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. జట్టు ఓడినా, గెలిచినా చప్పట్లతో మద్దతు తెలిపే కావ్య మారన్.. ఫైనల్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓడిపోవంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు తిరుగుతున్నా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇక కంట వెంట నీళ్లు కారుతుంటే వెనక్కి తిరిగి తుడుచుకోవడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ప్రస్తుతం కావ్య మారన్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లు చేసి 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుసగా వికెట్లు పడిపోయాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. వెంకటేశ్ అయ్యర్ (52*), xikhve/h (39) చెలరేగడంతో 10.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఐపీఎల్-2024 సీజన్ కప్‌ను సొంతం చేసుకుంది.