ఐపీఎల్-2024 సెకండ్ షెడ్యూల్ మ్యాచ్‌లు భారత్‌లో ఉండవా..?
ఐపీఎల్-2024 సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 16 March 2024 8:30 AM ISTఐపీఎల్-2024 సెకండ్ షెడ్యూల్ మ్యాచ్‌లు భారత్‌లో ఉండవా..?
ఐపీఎల్-2024 సీజన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ లీగ్ కోసం ఫస్ట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. తొలి షెడ్యూల్లో భాగంగా 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 22వ తేదీన తొలి మ్యాచ్ జరగనుంది. ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లోనే మంచి క్రేజ్ ఉన్న టీమ్‌లు తలపడుతుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి షెడ్యూల్‌లోని చివరి 21వ మ్యాచ్ లక్నో, గుజరాత్ మధ్య ఏప్రిల్ 24 మధ్య జరగనుంది. లీగ్‌కు సమయం దగ్గరపడటంతో ఆయా టీముల్లోని ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తమ టీమ్‌ను గెలిపించుకునేందుకు చెమటోడ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఐపీఎల్ సీజన్-2024 రెండో షెడ్యూల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఐపీఎల్ రెండో షెడ్యూల్ మ్యాచ్‌లు భారత్ బయటే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే లీగ్ నిర్వహణపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత ఐపీఎల్ మ్యాచ్‌లపై క్లారిటీ ఉంది. ఇక ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి ఐపీఎల్ మేనేజ్‌మెంట్ రెండో షెడ్యూల్ మ్యాచ్‌లపై ప్లాన్ చేయనుంది. ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల పాస్‌పోర్టులు తీసుకుని వీసాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దాంతో.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ వెలుపలే ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఉన్నాయి.