IPL-2024: వరుణుడి గండం! ఆర్సీబీ, చెన్నై మ్యాచ్ జరిగేనా?
ఐపీఎల్ 2024 లీగ్ ఉత్సాహంగా కొనసాగింది. ప్రస్తుతం ఈ క్రికెట్ పండుగ ఆసక్తికరంగా మారింది.
By Srikanth Gundamalla Published on 16 May 2024 11:42 AM ISTIPL-2024: వరుణుడి గండం! ఆర్సీబీ, చెన్నై మ్యాచ్ జరిగేనా?
ఐపీఎల్ 2024 లీగ్ ఉత్సాహంగా కొనసాగింది. ప్రస్తుతం ఈ క్రికెట్ పండుగ ఆసక్తికరంగా మారింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఏ టీమ్ తప్పుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు రావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అత్యంత ముఖ్యమైన మ్యాచ్ చెన్నైతో శనివారం జరగనుంది. అయితే.. మ్యాచ్ విషయంలో బెంగళూరు టీమ్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పారు వాతావరణశాఖ అధికారులు. తప్పకుండా ఆర్సీబీ గెలవాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ఈ ఇంపార్టెంట్ మ్యాచ్ శనివారం సాయంత్రం బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే.. బెంగళూరులో 5 రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నాయని ఓ ప్రయివేటు వాతావరణ వెబ్‌సైట్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆక్యువెదర్ వెబ్‌సైట్ అంచనాల ప్రకారం శనివారం చిన్నస్వమి స్టేడియంపై 99 శాతం మబ్బులు పరుచుకునే ఉంటాయని తెలిపింది. మధ్యాహ్న సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడే చాన్స్ ఉందని చెప్పారు. అలాగే సాయంత్రం వేళ కూడా వర్షం కురిసే అవకాశం 74 శాతం మేర ఉందని అంచనా వేశారు. రాత్రికి 100 శాతం మబ్బులు వ్యాపించి ఉంటాయన్నారు. 62 శాతం వర్షం పడే అవకాశాలే ఉన్నాయని సదురు సంస్థ వెల్లడించింది.
ఒక వేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే.. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్‌కు చెరో పాయింట్ లభిస్తుంది. ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్న చెన్నై 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఆర్సీబీ 13 పాయింట్లు పొంది ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుని ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుంది. కాగా.. ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్‌లను కోల్‌కతా, రాజస్థాన్ టీమ్‌లు ఖాయం చేసుకున్నాయి. మరో రెండు ప్లేఆఫ్స్ బెర్త్‌ల కోసం ఎస్‌ఆర్‌హెచ్, ఆర్‌సీబీ, ఢిల్లీతో పాటు ఎల్‌ఎస్‌జీ జట్లు పోటీ పడుతున్నాయి. రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఎస్‌ఆర్‌హెచ్.. ఒక్కటి గెలిచినా కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. అయితే.. గురువారం గుజరాత్‌తో హైదరాబాద్ సన్‌రైజర్స్ తలపడనుంది.