నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్.. ఆర్సీబీ దశ మారేనా.?

ఐపీఎల్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ఇప్పటి వరకూ కప్ కొట్టలేకపోయింది.

By Medi Samrat  Published on  15 April 2024 5:00 PM IST
నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్.. ఆర్సీబీ దశ మారేనా.?

ఐపీఎల్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ఇప్పటి వరకూ కప్ కొట్టలేకపోయింది. ఈ సీజన్ లో కూడా ఆ జట్టు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఈరోజు ఆర్సీబీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో తలపడనుంది. రెండు జట్లు గతంలో టోర్నమెంట్‌లో 22 సార్లు తలపడగా SRH స్వల్ప ఆధిక్యాన్ని కలిగి ఉంది.

RCB v SRH హెడ్-టు-హెడ్ 22 మ్యాచ్ లు జరిగాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్ లలో విజయం సాధించగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 విజయాలను సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ టై అయింది. మ్యాచ్ రాత్రి 7:30 PM IST కి ప్రారంభమవుతుంది, మ్యాచ్‌కి అరగంట ముందు టాస్ జరుగుతుంది. M చిన్నస్వామి స్టేడియం వేదికగా.. బెంగళూరులో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. JioCinemaలో లైవ్ చూడొచ్చు.

Next Story