ఒక్కో డాట్ బాల్‌కు 500 చెట్లు.. 1.61 లక్షల మొక్కలు నాటనున్న బీసీసీఐ
ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్‌లో నమోదు అయిన ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 చెట్లు నాటనుంది.
By అంజి Published on 28 May 2024 3:45 PM ISTఒక్కో డాట్ బాల్‌కు 500 చెట్లు.. 1.61 లక్షల మొక్కలు నాటనున్న బీసీసీఐ
ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్‌లో నమోదు అయిన ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 చెట్లు నాటనుంది. క్వాలిఫయర్1, 2, ఎలిమినేటర్, ఫైనల్‌తో కలిపి మొత్తం 323 డాట్ బాల్స్ నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే టాటా కంపెనీ భాగస్వామ్యంతో బీసీసీఐ మొత్తం 1,61,500 చెట్లను నాటనుంది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌లో నటరాజన్ అత్యధిక డాట్ బాల్స్ వేశారు. మూడు ఇన్సింగ్స్‌లో 26 డాట్స్ వేసి 13 వేల మొక్కలు నాటేందుకు సహాయపడ్డారు.
క్వాలిఫైయర్ 1లో, కోల్‌కతా నైట్ రైడర్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి, తమ చివరి స్థానాన్ని కైవసం చేసుకున్నప్పుడు, మొత్తం 73 డాట్ బాల్స్ వేయబడ్డాయి. అదే అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో, రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 74 డాట్ బాల్స్ వేయబడ్డాయి.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్ 2లో ఎస్‌ఆర్‌హెచ్.. ఆర్‌ఆర్‌ని ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 96 డాట్ బాల్స్ వేయబడ్డాయి. చెన్నైలోని ఇదే వేదికపై జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్‌లో.. కేకేఆర్.. సన్‌రైజర్స్‌న ఓడించి మూడోసారి టైటిల్‌ని గెల్చుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 80 డాట్ బాల్స్ బౌల్ వేశారు. మొత్తంగా 323 డాట్ బాల్స్ నమోదు అయ్యాయి. దీంతో బీసీసీఐ 1,61,500 చెట్లను నాటనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది 294 డాట్ బాల్స్ మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో బీసీసీఐ, టాటా గ్రూప్ యొక్క ఇండియా గ్రీన్ ఇనిషియేటివ్‌లో భాగంగా మొత్తం 1,47,000 చెట్లను నాటింది.