IPL-2024: 'ఆ స్ట్రాటజీతోనే రాణించా'.. సన్‌రైజర్స్ ప్లేయర్ నితీశ్‌రెడ్డి
ఐపీఎల్-2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న మ్యాచ్‌లు అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 April 2024 10:53 AM ISTIPL-2024: 'ఆ స్ట్రాటజీతోనే రాణించా'.. సన్‌రైజర్స్ ప్లేయర్ నితీశ్‌రెడ్డి
ఐపీఎల్-2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న మ్యాచ్‌లు అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. చివరి బంతి వరకు ఫలితం ఉత్కంఠగా మారిన మ్యాచ్‌లను చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ ఇది కదా కిక్ అంటే అంటున్నారు. ఇక ఈ ఐపీఎల్ యువ ఆటగాళ్లకు గొప్ప వరంగా మారింది. తమ టాలెంట్‌ను చూపించుకునే అవకాశం దక్కుతుంది. తాజాగా తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి తన అద్భుత ప్రదర్శనతో మైమరిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉన్న ఈ తెలుగు ఆటగాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు.
నితీశ్ రెడ్డి 2023 ఐపీఎల్ సీజన్‌లోనే అరంగేట్రం చేశాడు. అప్పుడు అతన్ని టీమ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపుణ మ్యాచ్‌లో అతను తొలి సారిగా ఐపీఎల్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. కానీ.. అప్పుడు నితీశ్‌కు తన ప్రతిభను చాలే అవకాశాలు పెద్దగా లభించలేదు. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి.. 14 పరుగులే చేశాడు. ఎక్కువ సమయం బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కానీ.. 2024 ఐపీఎల్ సీజన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చాన్స్ లు వచ్చాయి. దాంతో.. నితీశ్‌రెడ్డి టాలెంట్‌ను నిరూపించుకుంటున్నాడు. ఏప్రిల్ 9న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే 64 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాప్ ఆర్డర్ కొద్ది స్కోరుకే కూలిపోయింది. నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ క్రీజులో నిలదొక్కుకోవడానికి కొంచెం సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత మెల్లిగా సింహంలా జూలు విదల్చాడు. ఆచితూచి ఆడుతూ.. అనుకూలమైన బంతులు వస్తు బౌండరీలు, సిక్స్‌లు బాదేశాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేశారు. ఓవరాల్‌గా 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలింగ్ కూడా వేశారు నితీశ్ రెడ్డి. 3 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చాడు. పంజాబ్ మెరుపు బ్యాటర్ జితేశ్ శర్మ వికెట్‌ను తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు గాను నితీశ్‌రెడ్డికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ వచ్చింది.
ఇక ఈ మ్యాచ్‌లో రాణించడం గురించి నితీశ్ రెడ్డి మాట్లాడాడు. తనకు తన మీద నమ్మకం ఉందనీ.. జట్టుకోసం బాగా ఆడాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అలా లోపలే మాట్లాడుకుంటూ రాణించానని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లు బాగా వేయడాన్ని గమనించానని చెప్పాడు. వారి బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతూ.. స్పిన్నర్లు వేస్తున్నప్పుడు పరుగులు సాధించాలని ఫిక్స్ అయ్యానని చెప్పారు. అదే విధంగా చేశానని చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి మ్యాచుల్లో కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించాలని అనుకుంటున్నట్లు సన్‌రైజర్స్ ప్లేయర్ నితీశ్‌రెడ్డి అన్నాడు. కాగా.. పంజాబ్ కింగ్స్‌తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.