IPL-2024: ముంబై ఇండియన్స్‌లోకి సూర్య ఎంట్రీ ఇంకెప్పుడు?

గుజరాత్‌ టైటాన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడిన ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. ఇక ఇప్పుడు హైదరాబాద్‌తో పోరుకు రెడీ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  26 March 2024 9:15 AM GMT
ipl-2024, mumbai indians, suryakumar yadav, SRH,

IPL-2024: ముంబై ఇండియన్స్‌లోకి సూర్య ఎంట్రీ ఇంకెప్పుడు?

ఐపీఎల్-2024 సీజన్‌ ఘనంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడిన ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. ఇక ఇప్పుడు హైదరాబాద్‌ టీమ్‌తో పోరుకు రెడీ అవుతోంది. మార్చి 27వ తేదీన ఈ మ్యాచ్‌ జరగబోతుంది. అయితే.. ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో సూర్య కుమార్ యాదవ్ లేని లోటు కనిపిస్తోంది. అతని ఎంట్రీ తొలి మ్యాచ్‌ నుంచే ఉంటుందని అభిమానులంతా అనుకున్నారు. కానీ.. అలా జరగలేదు. ఎన్‌సీఏ నుంచి ఎన్‌ఓసీ లభించకపోవడంతో గుజరాత్‌తో మ్యాచ్‌కు సూర్య కుమార్‌ యాదవ్ దూరంగా ఉన్నాడు. అయితే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ కు అయినా అందుబాటులోకి వస్తాడా అనేది ఉత్కంఠగా మారింది.

సూర్యకుమార్‌ యాదవ్‌కు ఎన్‌సీఏ ఇంకా ఎన్‌ఓసీ ఇవ్వలేదని సమాచారం. ఎన్‌ఓసీ ఇస్తేనే అతను ఐపీఎల్‌లోకి రాగలడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో మ్యాచ్‌కు కూడా సూర్య తన టీమ్‌కు అందుబాటులోకి రావడం కష్టమే అనిపిస్తోంది. మంగళవారం సాయంత్రంలోగా ఎన్‌సీఏ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఓన్‌ఓసీ ఇస్తే.. బుధవారం మ్యాచ్‌కు అతను వస్తాడు. లేదంటే అతను హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా దూరంగానే ఉండాల్సి వస్తుంది. ఈ మ్యాచ్‌కు కూడా సూర్యకుమార్‌ దూరమైతే ముంబై విజయవకాశాలపై ప్రభావం చూపే చాన్సెస్‌ ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్‌ టీ20ల్లో అద్భుతంగా ఆడతాడు. ఆకాశమే హద్దుగా ఆడుతుండటంతో స్కై అని పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ప్లేయర్‌ అందుబాటులో లేకపోతే ముంబైకి నష్టమనే చెప్పాలి.

కాగా.. సూర్యకుమార్ కొంతకాంగా గాయాలతో బాధపడుతూ సర్జరీలు చేయించుకున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. స్కై ఐపీఎల్ ఆడాలంటే ఎన్‌సీఏ వైద్యుల అనుమతి తప్పనిసరి. ఇక ఇప్పటికే ముంబై, హైదరాబాద్‌ జట్లు తమ తొలి మ్యాచుల్లో ఓటమిని చూశాయి. కాబట్టి తొలి గెలుపు కోసం రెండు టీమ్‌లు హోరాహోరీగా తలపడనున్నాయి.

Next Story