ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ ఆల్ టైమ్ రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా సాగుతోంది.
By Srikanth Gundamalla Published on 28 April 2024 3:30 AM GMTఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ ఆల్ టైమ్ రికార్డు
ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా సాగుతోంది. ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లను చూస్తూ క్రికెట్ అభిమానులు కిక్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇక శనివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కూడా ఉత్కంఠ భరితమైన మ్యాచ్ సాగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. లక్నో 196 పరుగుల భారీ స్కోరును నిర్దేశించినప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్ మూడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
అయితే.. ఈ మ్యాచ్‌లో కూడా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో భారీ స్కోరు సాధించడంలో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు 35 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఆల్ టైమ్ రికార్డును అందుకున్నారు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా 4000 పరుగులు సాధించిన ఆటగాడిన నిలిచాడు.
కేఎల్ రాహుల్‌కు 32 ఏళ్లు.. తాను ఐపీఎల్ అన్ని సీజన్లు కలిపి 94 మ్యాచ్‌లు ఆడాడు. అయితే.. ఓపెనర్‌గా అత్యంత వేగంగా 4వేల పరుగులు చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. కేఎల్ రాహుల్ కంటే ముందు 4000కు పైగా పరుగులు చేసినవారు ఉన్నా కూడా.. ఇంత వేగంగా ఎవరూ సాధించలేకపోయారు.
ఐపీఎల్ ఓపెనర్‌గా 4వేల పరుగులు చేసిన ప్లేయర్లు:
శిఖర్ ధవన్ : 6362 పరుగులు
డేవిడ్ వార్నర్ : 5909 పరుగులు
క్రిస్ గేల్ : 4480 పరుగులు
విరాట్ కోహ్లీ : 4041 పరుగులు
కేఎల్ రాహుల్ : 4010 పరుగులు