ఉప్పల్‌లో వర్షం.. SRH Vs GT మ్యాచ్ జరిగేనా..?
సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 May 2024 5:28 PM ISTఉప్పల్‌లో వర్షం.. SRH Vs GT మ్యాచ్ జరిగేనా..?
ఐపీఎల్ సీజన్ 2024 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్ రెండు స్థానాల్లో క్వాలిఫై అవ్వగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం పోటీ కొనసాగుతోంది. ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ సీజన్‌లో గతంలో తలపడగా.. గుజరాత్ గెలిచింది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్న స్‌ఆర్‌హెచ్‌కు వరణుడి అడ్డంకి ఏర్పడేలా ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కుండపోత వర్షం పడుతోంది. ఇక మ్యాచ్ జరగనున్న ఉప్పల్ స్టేడియంలో కూడా వర్షం మొదలైంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు నగరంలో ఎండ దంచి కొట్టింది. ఉన్నట్లుండి మధ్యాహ్నం 3 గంటలు దాటగానే మేఘాలు కమ్మేశాయి. ఇక కాసేపటికే వర్షం పడటం ప్రారంభం అయ్యింది. దాంతో. నగరం మొత్తం ఒక్కసారిగా చల్లబడింది. నగరవాసులకు ఒక వైపు ఉపశమనం లభించినా.. చాలా మంది క్రీడా అభిమానుల మనసుల్లో మాత్రం ఉప్పల్‌లో వర్షం త్వరగా తగ్గిపోయి మ్యాచ్ కొనసాగితే బాగుంటుందని కోరుకుంటున్నాయి. ఇక నగరంలోని కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కోఠి, బేగంబజార్, మెహదీపట్నం, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
ఇక కాసేపటి క్రితమే ఉప్పల్ స్టేడియంలో కూడా వర్షం కురవడం మొదలైంది. దాంతో.. అలర్ట్ అయిన స్టేడియం సిబ్బంది గ్రౌండ్‌ను కాపాడేందుకు కవర్స్‌ను కప్పారు. ఇక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిచేందుకు చాలా మంది అభిమానులు స్టేడియానికి వెళ్లారు. ఉన్నట్లుండి పడుతోన్న వర్షం కారణంగా వారికీ ఇబ్బంది తప్పడం లేదు. ఇక గ్రౌండ్‌లో కవర్లను పరిచిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు వరణుడు ఇవాళ్టి పడకపోతే చాలని అంటున్నారు.
మరోవైపు ఇవాళ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ జరగకపోయినా.. కొన్ని ఓవర్ల మ్యాచ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ.. వర్షం దానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మాత్రం.. ఇరు జట్లు ఒక్కో పాయింట్‌ను షేర్ చేసుకుంటాయి. దాంతో హైదరాబాద్ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. తద్వారా ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే అవుతుంది. ఇక ఈ మ్యాచ్ తర్వాత మే 19న పంజాబ్ కింగ్స్‌తో మరో మ్యాచ్ ఆడనుంది హైదరాబాద్ టీమ్.
#IPL #Uppal #Hyderabad
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 16, 2024
ఎస్ఆర్హెచ్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న ఫ్యాన్స్ వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. స్టేడియం బయట క్యూలో నిల్చున్న వారు తడిసి ముద్దయ్యారు. భారీ ఈదురు గాలులతో వర్షం కురుస్తుండటంతో స్టేడియం పరిసరాలన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు… pic.twitter.com/hS6vkhKMKO