ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2024 సీజన్ వినోదానికి కేరాఫ్‌గా మారింది. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 3 April 2024 8:45 PM ISTముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2024 సీజన్ వినోదానికి కేరాఫ్‌గా మారింది. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిరోజుల ముందే రెండో షెడ్యూల్ కూడా ప్రకటించింది ఐపీఎల్. మొత్తం అన్ని మ్యాచ్‌లు ఇండియాలోనే జరుగుతుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయింది ముంబై ఇండియన్స్ టీమ్. వరుసగా మూడు పరాజయాలను తన అకౌంట్‌లో వేసుకుంది. దాంతో.. ఆ టీమ్ ఫ్యాన్స్ కూడా ఒకింత అసహనంగా ఉన్నారు.
ముంబై ఇండియన్స్ టీమ్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఆటగాడు, విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ముంబై తరఫున ఆడేందుకు వస్తున్నాడు. ముంబై నెక్ట్స్ మ్యాచ్‌కు అతడు గ్రౌండ్‌లో అడుగుపెడతాడని తెలుస్తోంది. ఎన్‌సీఏ వైద్యులు సూర్యకుమార్ యాదవ్‌కు అన్ని క్లియరెన్స్‌లు ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 7వ తేదీన ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలబడబోతుంది. ఈ మ్యాచ్‌కు సూర్యకుమార్ అందుబాటులోకి వస్తాడని ఎన్‌సీఏకు చెందిన ఓ అధికారి చెప్పాడు. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది.
కాగా.. సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ప్రస్తుత సీజన్‌లో దూరంగా ఉన్నాడు. మడమ, స్పోర్ట్స్ హెర్నియా సర్జరీల కారణంగా సూర్యకుమార్ యాదవ్ గత నాలుగు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో.. మొదటి మూడు మ్యాచుల్లో కూడా సూర్యకుమార్ యాదవ్ ఆడలేదు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ టీమ్‌లో ఉండి ఉంటే ఫలితాలు మారేవని అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సూర్య లేని లోటు కనిపిస్తుందని అంటున్నారు. మరి త్వరగా సూర్య టీమ్‌లోకి వచ్చి.. తన అద్భుత ప్రదర్శనను కంటిన్యూ చేస్తాడా? లేదా అని తెలియాల్సి ఉంది.