ఆర్సీబీకి కలిసిరాని చెపాక్‌.. మరి ఈసారేం జరుగుతుందో..!

ఐపీఎల్‌ సమరం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది.

By Srikanth Gundamalla  Published on  22 March 2024 7:43 AM GMT
ipl-2024, CSK Vs RCB, cricket,

 ఆర్సీబీకి కలిసిరాని చెపాక్‌.. మరి ఈసారేం జరుగుతుందో..!

ఐపీఎల్‌ సమరం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. వారి నిరీక్షణకు ఇంకొద్ది గంటల్లో తెరపడనుంది. అయితే.. తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌లు తలబడపోతున్నాయి. ఈ మ్యాచ్‌ హైవోల్టేజ్‌ మ్యాచ్‌గా చెబుతున్నారు అభిమానులు. ఇటు ధోనీ.. అటు విరాట్‌ కోహ్లీల కోసం ఎదురుచూస్తోన్న అభిమానులు ఎంతో మంది ఉంటారు. ఫస్ట్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

ఆర్‌సీబీ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య ఫస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ చెపాక్‌ స్టేడియంలో జరుగుతుంది. అయితే.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఈ రెండు టీమ్‌లు మొత్తం 31 సార్లు తలబడ్డాయి. ఇందులో చెన్నై 20 సార్లు విజయాన్ని అందుకోగా.. ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించింది. ఇక ఒక్కసారి మాత్రం డ్రాగా ముగిసింది మ్యాచ్.

గత ఐపీఎల్‌ సీజన్‌లో చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై చెన్నై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఆర్‌సీబీకి చెపాక్‌ స్టేడియం పెద్దగా కలిసి రాలేదు. స్టాట్స్‌ చూస్తేనే అర్థం అవుతోంది. 2008లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిచింది. కానీ.. ఆ తర్వాత నుంచి 7-1 తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. ఐపీఎల్​ 2019 ఓపేనర్​లో కూడా సీఎస్​కే- ఆర్​సీబీ తలపడ్డాయి. 17.4 ఓవర్లు మాత్రమే ఆడిన ఆర్​సీబీ.. 70 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. సీఎస్​కే.. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2012 సీజన్‌లో ఇక్కడే రెండు టీమ్‌లు తలపడగా.. ఆర్‌సీబీ 205 పరుగులు చేసింది. ఆ తర్వాత సీఎస్కే పని అయిపోయిందనీ అనుకున్నారు అంతా. కానీ.. ఆల్బీ మార్కెల్‌, జడేజా, డ్వైన్‌ బ్రోవోలు అద్బుత ఇన్నింగ్స్‌ ఆడి పని ముగించారు. అలా విజయాల కన్నా ఎక్కువ ఆర్‌సీబీకి అపజయాలే ఉన్నాయి.

ఐపీఎల్‌-2024 సీజన్‌లో జరుగుతున్న ఫస్ట్‌ మ్యాచ్‌.. ఇందులో ఆర్‌సీబీ ఎలా రాణిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇక ఇదే డబ్ల్యూపీఎల్‌-2024 సీజన్‌ టైటిల్‌ను రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్‌ టీమ్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీకి తొలి కప్‌ను ఉమెన్స్‌ అందించారు.

Next Story