ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌.. రిషబ్‌ పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం

ఐపీఎల్ సీజన్ 2024 ప్లే ఆఫ్స్‌ రేస్‌ రసవత్తరంగా మారుతోంది.

By Srikanth Gundamalla  Published on  11 May 2024 2:15 PM GMT
ipl-2024, cricket, shock,  delhi capitals, rishabh pant,

 ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌.. రిషబ్‌ పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం

ఐపీఎల్ సీజన్ 2024 ప్లే ఆఫ్స్‌ రేస్‌ రసవత్తరంగా మారుతోంది. అయితే.. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆర్‌సీబీతో జరగబోయే ఇంపార్టెంట్‌ మ్యాచ్‌కు.. డీసీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ దూరం కానున్నాడు. కెప్టెన్‌ పంత్‌పై ఒక మ్యాచ్‌ నిషేధం విధించడమే ఇందుకు కారణం. అయితే.. పంత్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ ఆడకుండా ఉండేలా బ్యాన్ చేసినట్లు అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. ఇందుకు కారణం కూడా వారు తెలిపారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో డీసీ జట్టు మూడుసార్లు స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేయడమే అని వివరించారు.

కాగా.. రెండు సార్లు స్లో ఓవర్‌ రేట్‌ను మెయింటెయిన్‌ చేసినందుకు రిషబ్‌ పంత్‌కు జరిమానా వేశారు నిర్వాహకులు. ఏప్రిల్ 4న విశాఖలో జరిగిన కోల్‌కతా మ్యాచ్‌లో రెండోసారి స్లో ఓవర్‌ రేటు నమోదు అయ్యింది. అప్పుడు పంత్‌కు రూ.24 లక్షల ఫైన్‌ విధించారు. అంతకు ముందు విశాఖలోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్‌ రేట్‌ను కొనసాగించారు. దాంతో..అప్పుడు 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. మరోసారి ఇటీవల రాజస్థాన్‌ తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఢిల్లీ టీమ్‌ నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటాను పూర్త చేయలేదు. ఐపీఎల్ నియామవళి ప్రకారం మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పంత్‌పై వందశాతం మ్యాచ్‌ ఫీజు జరిమానా విధించడంతో పాటు.. ఒక మ్యాచ్‌ నిషేధం కూడా విధించినట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది.

ఈ సీజన్‌లో ఇప్పటి దాకా 12 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. ఆరింటిలో విజయం సాధించింది. 12 పాయింట్లతో ఐదోస్థానంలో ఉంది. అయితే.. ప్లేఆఫ్స్‌లో స్థానం పొందాలంటే తప్పకుండా ఈ టీమ్‌ మిగిలిన రెండు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా ఇంటి బాట పట్టాల్సిందే. ఇలాంటి క్లిష్ట సమయంలో రిషబ్‌ పంత్‌ వంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌.. పైగా కెప్టెన్‌ ఆ టీమ్‌కు దూరం అవ్వడం మైనస్‌గానే చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.

Next Story