IPL-2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 షెడ్యూల్ వచ్చేసింది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 5:53 PM IST
IPL-2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే..
భారత్‌లో క్రికెట్‌కు అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇతర క్రీడలతో పోలిస్తే క్రికెట్‌కు ఎక్కువనే చెప్పాలి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లీగ్‌లో జరిగే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే.. ఒక్కో టీమ్‌కు ఒక్కో ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. తమ టీమ్ ఈసారి కప్ కొడుతుందంటే.. తామంటే బెట్టింగ్‌లు పెట్టుకుంటుంటారు. ఐపీఎల్-2024 సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆతృతగా చూస్తోన్న అభిమానులకు ఇదే శుభవార్త.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 షెడ్యూల్ వచ్చేసింది. మొదటి 21 మ్యాచ్‌ల కోసం షెడ్యూల్‌ను విడుదల చేశారు నిర్వాహకులు. మొత్తంగా మార్చి 22న మెగా ఈవెంట్‌కు తెర లేవనుంది. అక్కడ అక్కడి నుంచి క్రికెట్ పండగ మొదలు కానుంది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లు సాయంత్రం 6.30 గంటలకు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుండటం విశేషం. ఇక రెండో రోజు మార్చి 23న మధ్యాహ్నం, సాయంత్రం రెండు మ్యాచ్‌లు ఉంటాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. ఇక సాయత్రం 6.30 గంటలకు కోల్‌కతా, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది.
అయితే.. ముందుగా ఊహించినట్లుగానే రెండు షెడ్యూల్స్‌లో ఐపీఎల్-2024 సీజన్ షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. తొలి షెడ్యూల్ గురువారం విడుదల అయ్యింది. ఇక రెండో షెడ్యూల్‌ను కూడా నిర్వాహకులు త్వరలోనే విడుదల చేయనున్నారు.