రాజస్థాన్‌తో సన్‌రైజర్స్ ఢీ.. గెలిస్తే టాప్-4లోకి...
ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 10:27 AM ISTరాజస్థాన్‌తో సన్‌రైజర్స్ ఢీ.. గెలిస్తే టాప్-4లోకి...
ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక పోరుకు సిద్ధం అయ్యింది. గత రెండు మ్యాచుల్లో వరుసగా ఓటమిని చూసిన హైదరాబాద్.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. గురువారం రాత్రి హైదరాబాద్ టీమ్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఈ సీజన్‌లో గుజరాత్‌తో ఆడిన మ్యాచ్ మినహా రాజస్థాన్ రాయల్స్ అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇక ఇదే జోరును హైదరాబాద్ తో జరగనున్న మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని రాజస్థాన్ భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్-4 బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకోవాలని సన్‌రైజర్స్ రెడీ అవుతోంది. ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ సీజన్‌లో టాప్ ఆర్డర్ రాణించడంతో ఫస్ట్ హాఫ్‌లో రికార్డు స్కోర్లను నమోదు చేసింది హైదరాబాద్. కానీ ఇప్పుడు డీలా పడిపోయింది. గత రంఎడు మ్యాచుల్లో ఓపెనర్లు విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. రెండుసార్లు కూడా ఛేజింగ్‌లోనే ఓటమిని చూసింది సన్‌రైజర్స్. ఈ క్రమంలోనే టాప్-4లోకి వెళ్లాలంటే ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు హెన్రిచ్ క్లాసెన్‌లు రాణించాలనీ.. వారిపై భారీ ఆశలు పెట్టుకుంది టీమ్ మేనేజ్‌మెంట్. బౌలింగ్‌లో తేలిపోతున్న క్రమంలో భువనేశ్వర్, ప్యాట్ కమిన్స్ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని ఫ్రాంచైజీ కోరుకుంటోంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 9 మ్యాచుల్లో 8 గెలిచింది. దాదాపుగా ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇక ఆ జట్టు దృష్టి అంతా టాప్-2పైనే ఉంటుంది. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్‌లతో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ ఫామ్‌లోకి రావడం ఆ టీమ్‌కు కలిసి వచ్చింది. బౌలింగ్ కూడా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ట్రెంట్ బౌల్ట్, సందీప్ వర్మ, చాహల్ రాణిస్తుండటంతో రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది.