ఐపీఎల్‌లో ఈసారి ఎక్కువ పరుగులు చేసేది అతనే..!
ఐపీఎల్2024 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లోనే సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 21 March 2024 4:00 PM GMTఐపీఎల్‌లో ఈసారి ఎక్కువ పరుగులు చేసేది అతనే..!
ఐపీఎల్2024 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లోనే సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మార్చి 22న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగబోతుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగినన్ని రోజులు క్రికెట్ అభిమానులు ఈ ఫీవర్‌లో మునిగి తేలుతారు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు ఈ సారి ఎవరు హైస్కోర్ చేస్తారు? ఎవరెక్కువ వికెట్లు తీస్తారనే దానిపై అంచనాలు వేస్తున్నారు. అవి కూడా క్రికెట్ అభిమానుల్లో హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఐపీఎల్ 2024 సీజన్‌లో కొన్ని హైలెట్స్ గురించి ముందే జోస్యం చెప్పారు. 2024 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసేదెవరో ముందే చెప్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అవుతాడని తన అభిప్రాయం తెలిపాడు మైకేల్ వాన్. ఓఓ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన షోలో మైకేల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఓలీ సిల్వర్టన్‌తో కలిసి పాల్గొన్నాడు. ఇక ముంబై తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ బెస్ట్ స్ట్రైక్‌రేట్ కలిగిన బ్యాటర్‌గా నిలుస్తాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఫ్రెష్‌గా టీ20 క్రికెట్ ఆడబోతున్నాడు కాబట్టి అతనే ఆరెంజ్ క్యాప్ అందుకుంటాడని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ చెప్పాడు.
ఆడమ్ గిల్ క్రిస్ట్ మాత్రం.. ఆరెంజ్ క్యాప్‌ను యశస్వి జైస్వాల్ దక్కించుకుంటాడనీ.. టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని చెప్పాడు. అంతేకాదు.. అధిక స్ట్రయిక్ రేట్ ఉన్న బ్యాటర్‌గా కూడా యశస్వి నిలుస్తాడని ఆడమ్ చెప్పాడు. అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడనీ.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అతని ఆటతీరు చూసినప్పుడే అర్థమైందని చెప్పాడు. అక్కడ యశస్వి జైస్వాల్ రెండు సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ ఓలీ సిల్వర్‌స్టోన్ మాట్లాడుతూ.. ఈసారి ఆరెంజ్ క్యాప్‌ను పంజాబ్ కింగ్స్ ప్లేయర్ లివింగ్ స్టోన్ అందుకుండాడని చెప్పాడు. దీనికి మైకేల్ వాన్ కూడా ఏకీభవించాడు. అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. అయితే.. లివింగ్ స్టోన్ ఇండియాలో ఉన్న కండిషన్స్‌లో ఎలా రాణిస్తాడో చూడాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.