IPL-2024: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే ఇలా జరగాల్సిందే..!

ఐపీఎల్-2024 సీజన్‌ చివరి దశకు వచ్చేసింది.

By Srikanth Gundamalla  Published on  17 May 2024 4:45 AM GMT
ipl-2024, cricket, playoffs, RCB Vs CSK,

 IPL-2024: ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి చేరాలంటే ఇలా జరగాల్సిందే..! 

ఐపీఎల్-2024 సీజన్‌ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే మూడు ప్లేఆఫ్స్‌ బెర్త్‌లను ఆయా టీమ్‌లు కన్ఫామ్‌ చేసుకున్నాయి. ఇక చివరి బెర్త్‌ కోసం ఆర్సీబీ, చెన్నై మధ్య పోటీ నెలకొంది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగాల్సిన ఎస్‌ఆర్‌హెచ్, గుజరాత్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దాంతో.. చెరో పాయింట్ లభించింది. అలా 15 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. ప్లేఆఫ్స్‌ను కన్ఫామ్ చేసుకుంది. ఇక వరుసగా టాప్‌ -3 స్థానాల్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచాయి. చివరి స్థానం కోసం చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరగనుంది.

శనివారం రాత్రి ఈ మ్యాచ్ బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరగనుంది. బెంగళూరులో ఈ మ్యాచ్‌ జరుగుతుండటం ఆర్‌సీబీకి కాస్త కలిసివచ్చే అంశమనే అంటున్నారు అభిమానులు. అయితే.. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే 14 పాయింట్లు, +0.528 నెట్ రన్ రేట్‌తో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లు, +0.387 నెట్‌ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. శనివారం జరగనున్న మ్యాచ్‌తో నాలుగో టీమ్‌ ఫ్లేఆఫ్స్‌ ఖరారు కాబోతుంది.

బెంగళూరు ఈసారి ప్లేఆఫ్స్‌కు వెళ్లాలని ఆ టీమ్‌ అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. కానీ.. ఇందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. చెన్నైపై గెలిచినా కూడా సమీకరణంలో మాత్రమే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లగలదు. గెలుపు కూడా అవసరమైన నెట్‌ రన్‌రేట్‌కు తగ్గట్లు కావాల్సినన్ని పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ చేసి చెన్నైకి 200 పరుగుల టార్గెట్‌ను ఇస్తే.. డూప్లెసిస్ సేన 18 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ లక్ష్యచేదనకు దిగితే మాత్రం 18.1 ఓవర్లలో టార్గెట్‌ను ఫినిష్‌ చేయాలి. ఇలా చేస్తే మాత్రమే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఉంటాయి.

ఒకవేళ చెన్నై గెలిస్తే మాత్రం రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన ప్లేఆఫ్స్‌ కన్ఫామ్ చేసుకుంటుంది. ఆర్‌సీబీ చేతిలో ఒకవేళ చెన్నై ఓడినా నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉంటే అర్హత సాధించే అవకాశాలున్నాయి. అంతేకాదు ఒకవేళ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. ఆర్సీబీపై చెన్నై విజయం సాధిస్తే మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో టాప్-2 స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశాలు సీఎస్కేకు ఉన్నాయి.

Next Story