IPL-2024: బోణి కొట్టిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్2024 సందడిగా కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్‌లను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 7 April 2024 8:45 PM ISTIPL-2024: బోణి కొట్టిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్2024 సందడిగా కొనసాగుతోంది. క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు క్రికెట్ మ్యాచ్‌లను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. కొన్ని టీమ్‌లకు ఈ సీజన్ ప్రారంభం కూడా అంతగా కలిసి రాలేదు. ఈ టీముల్లో ఒక్కటే ముంబై ఇండియన్స్. గతంలో ఐదు ట్రోఫీలను సాధించి.. స్ట్రాంగెస్ట్ టీమ్‌గా పేరు సంపాదించిన ఈ టీమ్ గత కొద్ది సీజన్లుగా రాణించలేకపోతుంది. అయితే.. 2024 సీజన్‌లో కూడా వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిని చవి చూసింది. దాంతో.. ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.
అయితే.. ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో నెగ్గింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 వోర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 49, ఇషాన్ కిషన్ 42, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 39, టిమ్ డేవిడ్ (45) నాటౌట్, రొమారియా షెపర్డ్ 39 (నాటౌట్) పరుగులు చేశారు.
ఇక 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యపిటల్స్ చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి ఓటమి పాలైంది. ట్రిస్టాన్ స్టబ్స్ స్వైర విహారం చేసినా, ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో ఓడిపోయింది. స్టబ్స్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు సిక్స్‌లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక పృథ్వీ షా 40 బంతుల్లో 8 ఫోర్లు ,మూడు సిక్స్‌లతో 66 పరుగలు చేశారు. అభిషేక్ పోరెల్ 41 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ 4 వికెట్లు, బుమ్రా 2, షెపర్డ్ ఒక వికెట్ తీశారు.