ఢిల్లీతో మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ వేయని పాండ్యా.. ఇదేనట కారణం..!

తొలి రెండు మ్యాచుల్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడని హార్దిక్ పాండ్యాపై విమర్శలు వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on  8 April 2024 11:34 AM IST
ipl-2024, cricket, mumbai indians, hardik pandya,

ఢిల్లీతో మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ వేయని పాండ్యా.. ఇదేనట కారణం..!

ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. ఈ సీజన్‌ క్రికెట్‌ అభిమానుల మంచి కిక్‌ ఇస్తోంది. ఆయా టీమ్‌ల అభిమానులు అయితే మ్యాచ్‌లు జరుగుతున్న స్టేడియాలకు వెళ్లి ఆటగాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఉత్సాహంగా మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ సీజన్‌ వరుసగా మూడు అపజయాల తర్వాత.. ముంబై ఇండియన్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా ఒక్క ఓవర్ కూడా వేయలేదు. దాంతో.. హార్దిక్ పాండ్యా ఎందుకు బౌలింగ్‌ వేయలేదనే దానిపై నెట్టింట ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

తొలి రెండు మ్యాచుల్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడని హార్దిక్ పాండ్యాపై విమర్శలు వచ్చాయి. దాంతో.. బౌలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుని ఉండొచ్చే అభిప్రాయాలు ఫ్యాన్స్‌ నుంచి వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే హార్దిక్‌ మరోలా స్పందించాడు. తాను సరైన సమయంలోనే బౌలింగ్ చేస్తానని వెల్లడించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాము ప్రతీది కవర్ చేశామని హార్దిక్ పాండ్యా అన్నాడు. అందుకే తాను బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదని చెప్పాడు. అప్పుడప్పుడు వ్యూహాత్మక మార్పులు చేస్తుంటామనీ.. ఇప్పుడు జట్టును మరింత పటిష్టం చేసుకోవడంలో దృష్టి పెట్టామని పాండ్యా వివరించాడ. తమ టీమ్‌లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవనీ.. అందరం కలిసే ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్తున్నట్లు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌ చెప్పాడు.

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో.. తొలుత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45), షెఫ్డర్ (39) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఇక 235 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ చివరి వరకు గట్టిగానే పోరాడింది. 205 పరుగులకే పరిమితం అయ్యింది. పృథ్వీ షా (66), స్టబ్స్ (71) తమ జట్టుని గెలిపించుకోవడం కోసం బాగానే పోరాడారు. కానీ.. చివరకు ఓటమి పాలైంది.

Next Story