IPL-2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్
ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 14 April 2024 11:06 AM GMTIPL-2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్
ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లను వీక్షిస్తూ క్రికెట్ ఫ్యాన్స్ కిక్‌ను ఆస్వాదిస్తున్నారు. ఆయా టీమ్‌ల అభిమానులు తమ ప్లేయర్స్‌ను సపోర్ట్ చేసేందుకు స్టేడియాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో మొదటి ఆరు మ్యాచుల్లో రెండే విజయాలను అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీమ్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో సూపర్ జెయింట్స్‌పై రెండో విజయాన్ని అందుకుంది. అయితే.. తాజాగా ఈ టీమ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొదటి 4 మ్యాచుల్లో 61 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, గాయం కావడంతో ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. మిచెల్ మార్ష్ గాయం కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని చికిత్స పొందినా నయం కాలేదు. ఆయన గాయానికి మెరుగైన చికిత్స అవసరం అని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దాంతో.. మిచెల్ మార్ష్ స్వదేశానికి పయనం అయ్యాడు. దాంతో.. మిచెల్ మార్ష్ 2024 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటంలేదని తెలుస్తోంది.
ఐపీఎల్ సీజన్ పూర్తయిన కొద్ది నెలలకే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ కూడా ప్రారంభం కాబోతుంది. టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్ ఉండబోతున్నాడు. దాంతో.. అతని ఫిట్‌నెస్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటోంది ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్. ఇప్పటికే స్టార్ బౌలర్ లుంగి ఇంగిడి, స్టార్ బ్యాటర్ హారీ బ్రూక్ ఇద్దరూ కూడా ఐపీఎల్ 2024 సీజన్‌కి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మిచెల్ మార్ష్ చేరాడు.