IPL-2024: అందుకే ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయాం: సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్
చిన్నస్వామి స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.
By Srikanth Gundamalla Published on 19 May 2024 7:38 AM ISTIPL-2024: అందుకే ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయాం: సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శనివారం చిన్నస్వామి స్డేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఇక ఓటమిని చూసిన సీఎస్కే ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసిన తర్వాత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. ఓటమి గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లే ఆర్సీబీ చేతిలో ఓటమి పాలయ్యామని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ అన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో 200 పరుగుల టార్గెట్‌ను చేధించడం పెద్ద కష్ట కాదని చెప్పాడు. గాయాలతో తమ ఫ్రంట్ లైన్ బౌలర్లు దూరం కావడంతో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయామని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. 219 పరుగుల టార్గెట్ ఉన్నా.. చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే 201 పరుగులు చేసి ఉన్నా సరిపోయేది. కాని 191 పరుగులు చేయడం ద్వారా రన్‌రేట్ ఆర్సీబీ కన్నా తక్కువగా ఉంది. దాంతో.. చెన్నై ఐదో స్థానానికి పడిపోయింది. ఆర్‌సీబీ నాలుగో స్థానానికి ఎగబాకి.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఇప్పటికే ఈ సీజన్‌లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ బెర్త్‌లు కన్ఫామ్ చేసుకున్నాయి.
ఇంకా మాట్లాడిన రుతురాత్ గైక్వాడ్.. ప్లేఆఫ్స్‌కి తాము చేరుకోలేకపోవడం నిరాశకు గురి చేసిందన్నాడు. కానీ..తమ టీమ్ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని చెప్పాడు. బంతి టర్న్ అవ్వడంతో పాటు కొంచెం ఆగుతూ వచ్చిందన్నాడు. రెండు, మూడు భారీ షాట్లు ఆడితే విజయానికి చేరువ అయ్యేవాళ్లం అన్నాడు. కొన్నిసార్లు టీ20 క్రికెట్‌లో ఇలాగే జరుగుతుంది అన్నాడు. 14 మ్యాచుల్లో ఏడింటిలో గెలిచామన్నాడు. చివరి రెండు బంతుల్లో లక్ష్యాన్ని అందుకోలేకపోయామన్నాడు. ఓ వైపు గాయాల బెడద వెంటాడినా.. ఇద్దరు ఫ్రంట్ లైన్ బౌలర్లు దూరమైనా.. టాపార్డర్‌లో డెవాన్ కాన్వే లేకుండా.. సీజన్ మొత్తంలో అసాధారణ ప్రదర్శన ఇచ్చామని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. ఇక తన విషయానికి వస్తే వ్యక్తిగత ప్రదర్శనకు ప్రాధాన్యత లేదనీ రుతురాజ్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై మరో 9 పరుగులు చేసి ఉంటే ప్లేఆఫ్స్‌కి చేరేది.