IPL-2024: రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్

రెండు మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఐపీఎల్ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 4:30 PM IST
ipl-2024, cricket, bcci, two matches, re-scheduled,

 IPL-2024: రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్

ఐపీఎల్-2024 సీజన్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా ఎంతో ఉత్సాహంగా మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. వినోదానికి కేరాఫ్‌గా మారిపోయింది. ఇక మ్యాచ్‌లు అన్నీ ఇండియాలోనే కొనసాగుతుండటంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే రెండు దఫాలుగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. తాజాగా రెండు మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో తెలిపారు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీన జరగాల్సి ఉంది. కానీ.. ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు. దాంతో.. ఈ రెండు టీమ్‌ల మధ్య మ్యాచ్‌ ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 16వ తేదీన జరగనుంది. కాగా..ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదిగా జరగనున్నట్లు వెల్లడించారు.

ఇక మరో మ్యాచ్‌ గుజరాత్ టైటాన్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా రీషెడ్యూల్‌ అయ్యింది. మామూలుగా అయితే ఏప్రిల్ 16వ తేదీన ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. కానీ.. ఈ మ్యాచ్‌ను ఆ తర్వాతి రోజుకు అంటే ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ మ్యాచ్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో కొనసాగనుంది.

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల ప్రకారం అయితే.. పాయింట్స్‌ టేబుల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తొలి స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడి.. మూడింటిలో విజయం సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా, చెన్నై సూపర్‌ కింగ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన వారిలో మొదటి స్థానంలో ఇద్దరు ఉన్నారు. రాజస్థాన్ ప్లేయర్ పరాగ్‌, బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ ఇద్దరూ చెరో 181 పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నారు. మూడు మ్యాచులు ఆడి 7 వికెట్లు తీసి బౌలర్లలో మొదటి స్థానంలో చెన్నై సూపర్‌ కింగ్స్ ప్లేయర్ ముస్తాఫిజుర్‌ ఉన్నాడు.


Next Story