ఐపీఎల్ వేలం.. ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసిందంటే..?
IPL 2023 Team wise players details.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2023 సీజన్‌కు ముందు
By తోట వంశీ కుమార్ Published on 24 Dec 2022 10:44 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2023 సీజన్‌కు ముందు నిర్వహించిన మినీ వేలంలో పలువురు ఆటగాళ్లు జాక్‌పాట్ కొట్టారు. అందరూ ఊహించినట్లుగానే సామ్ కరన్, కామెరూన్ గ్రీన్, బెన్ స్టోక్స్‌లపై కోట్ల వర్షం కురిసింది. కనీస ధర రూ.2 కోట్ల చొప్పున వేలంలో బరిలోకి దిగిన వీరిని సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సామ్ కరన్‌ను పంజాబ్ జట్టు రూ.18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ కూడా రూ.17.5 కోట్లతో జాక్‌పాట్ కొట్టేశాడు. ఇతడిని ముంబై కొనుగోలు చేసింది. ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ రూ.16.25 కోట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దక్కించుకుంది.
మినీవేలం ముగిసింది. మరి ఏయే జట్లు ఎవరెవరిని తీసుకున్నాయో ఓ సారి చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్ : బెన్ స్టోక్స్(రూ.16.25 కోట్లు), షేక్ రషీద్(రూ.20 లక్షలు), అజింక్యా రహానే(రూ.50 లక్షలు), నిశాంత్ సింధు(రూ.60లక్షలు), కైల్ జెమీసన్(రూ. కోటి), అజయ్ మండల్(రూ.20 లక్షలు), భగత్ వర్మ(రూ.20 లక్షలు)
ఢిల్లీ క్యాపిటల్స్ : ఫిల్ సాల్ట్ (రూ. 2 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ. 50 లక్షలు), ముఖేష్ కుమార్ (రూ. 5.50 కోట్లు), మనీష్ పాండే (రూ. 2.40 కోట్లు), రైలీ రస్సో (రూ. 4.60 కోట్లు) ఖర్చు చేసిన మొత్తం రూ.15 కోట్లు
గుజరాత్ టైటాన్స్ : శివన్ మావి(రూ.6కోట్లు), జోష్ లిటిల్(రూ.4.4కోట్లు), విలియమ్సన్ (రూ.2కోట్లు), కేఎస్ భరత్(రూ.1.2కోట్లు), మోహిత్ శర్మ(రూ.50లక్షలు), ఒడియన్ స్మిత్(రూ.50లక్షలు), ఉర్విల్(రూ.20లక్షలు),
కోల్‌కతా : ఎన్. జగదీషన్(రూ.90లక్షలు), షకీబ్ అల్ హసన్(రూ.1.5కోట్లు), మన్‌దీప్ సింగ్(రూ.50లక్షలు), లిట్టన్ దాస్(రూ.50లక్షలు), కుల్వంత్ ఖేజ్రోలియా(రూ.20లక్షలు), డేవిడ్ వైస్(రూ.1కోటి), సూయాస్ శర్మ(రూ.20లక్షలు), వైభవ్ అరోరా(రూ.60లక్షలు)
లఖ్‌నవూ : నికోలస్ పూరన్(రూ.16కోట్లు), సామ్స్(రూ.75లక్షలు),జయదేవ్ ఉనద్కత్, యశ్ ఠాకూర్(రూ.45లక్షలు), రొమారియో షెపర్డ్(రూ.50లక్షలు), అమిత్ మిశ్రా(రూ.50లక్షలు), ప్రేరక్ మన్కడ్(రూ.20లక్షలు), స్వప్నిల్ సింగ్(రూ.20లక్షలు)
ముంబై : విష్ణు వినోద్(రూ.20లక్షలు), డుయన్ జాన్సన్(రూ.20లక్షలు), కామెరాన్ గ్రీన్(రూ.17.5కోట్లు), షామ్స్ ములని(రూ.20లక్షలు), నేహళ్ వధేరా(రూ.20లక్షలు), జే రిచర్డ్‌సన్(రూ.1.5కోట్లు), పియూష్ చావ్లా(రూ.50లక్షలు), రాఘవ్ గోయల్(రూ.20లక్షలు)
పంజాబ్ : సామ్ కరన్(రూ.18.5కోట్లు), సికిందర్ రజా(రూ.50లక్షలు), హర్‌ప్రీత్(రూ.40లక్షలు), శివమ్ సింగ్(రూ.20లక్షలు), విద్వత్(రూ.20లక్షలు), మోహిత్(రూ.20లక్షలు),
రాజస్థాన్ : డోనోవన్ ఫెరీరా (రూ.50లక్షలు), కునాల్ సింగ్ రాథోర్ (రూ.20లక్షలు), జాసన్ హోల్డర్ (రూ.5.75కోట్లు), ఆడమ్ జంపా (రూ.1.5కోట్లు), కెఎమ్ ఆసిఫ్ (రూ.30లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ.20లక్షలు), ఆకాష్ వశిష్ట్ (రూ.20లక్షలు), అబ్దుల్ బాసిత్ (రూ.20లక్షలు), జోరూట్ (రూ.1కోటి)
బెంగళూరు : సోను యాదవ్ (రూ.20 లక్షలు), అవినాష్ సింగ్ (రూ.60 లక్షలు), రాజన్ కుమార్ (రూ.70 లక్షలు), మనోజ్ భాండాగే (రూ.20 లక్షలు), విల్ జాక్వెస్ (రూ.3.2 కోట్లు), హిమాన్షు శర్మ (రూ.20 లక్షలు), రీస్ టాప్లీ (రూ.1.9 కోట్లు).
హైదరాబాద్ : హ్యారీ బ్రూక్(రూ.13.25కోట్లు), మయాంక్ అగర్వాల్(రూ.8.25కోట్లు), హెన్రిచ్ క్లాసెన్(రూ.5.25కోట్లు), ఆదిల్ రషీద్(రూ.2కోట్లు), మయాంక్ మార్కండే(రూ.50లక్షలు), వివ్రాంత్ శర్మ(రూ.2.5కోట్లు), సమర్థ్ వ్యాస్(రూ.20లక్షలు), సన్వీర్ సింగ్(రూ.20లక్షలు), ఉపేంద్ర యాదవ్(రూ.25లక్షలు), మయాంక్ దాగర్(రూ.1.5కోట్లు), అకిల్ హోసేన్(రూ.1కోటీ), అన్మోల్ ప్రీత్ సింగ్(రూ.20లక్షలు), నితీష్ రెడ్డి(రూ.20లక్షలు)